డాషింగ్ అండ్ డేరింగ్ బ్యూటీ పూనమ్ పాండే పేరు వింటే ఆమె హాట్ లుక్స్ తో కూడుకున్న ఫోటోలు, వీడియోలతో పాటు ఆమె తరచూ తన ట్విట్టర్ ద్వారా ఇచ్చే బూతు సందేశాలు కూడా గుర్తుకు వస్తాయి. తన పాపులారిటీ పెంచుకోవడం కోసం డబల్ మీనింగ్ పదాలతో ఆమె తన ట్విట్టర్ లో సందేశాలు పెడుతూనే ఉంటుంది. అది జరగకుండా ఆమెకు తెల్లారదు.

 ప్రస్తుతం పూనమ్ ‘నషా’ అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తూ, ఆ సినిమాకు సంబంధించిన తన హాట్ లుక్ ఫోటోలతో యువతరానికి కేక పుట్టిస్తోంది. అటువంటి పూనమ్ కు ఏమైందో ఏమో తెలియదు కాని ఈ రోజు ఉదయం జ్ఞానోదయం కలిగి ఒక విచిత్రమైన సందేశాన్ని సాయి బాబా కు ఇష్టమైన గురువారం రోజు తన అభిమానుల కోసం ట్విట్టర్ లో పెట్టింది. ఇంతకీ ఆ సందేశం ఏమిటి అనుకుంటున్నారా..? ఆమె మాటలలోనే చదవండి. “అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాద్ మహారాజ్ కి జై” అంటూ ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని ఈరోజు తన అభిమానులపై వదిలింది.

పూనమ్ లో ఇంత మార్పుకు కారణం ఈమె ఈరోజు షిర్డీ లో సాయిబాబా ను ధర్శించుకుందట. బాబా మాహత్యమో, మరే కారణమో తెలియదు కాని పూనమ్ ఈరోజు ఇటువంటి సందేశాన్ని తన ట్విట్టర్ లో పెట్టడం ఆమె నుంచి బూతు సందేశాలకు అలవాటు పడ్డ అభిమానులకు మైండ్ బ్లాంక్ చేసిందట. మరి సాయిబాబా ప్రభావం పూనమ్ పండే పై ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.  
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: