మెగా యాంగ్ హీరోగా ‘ముకుంద’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ ను చూసి మెగా అభిమానులు మెగా ప్రిన్స్ గా మారిపోతాడు అని ఆశించారు. ఇప్పటి వరకు వరుణ్ తేజ్ నటించిన సినిమాలలో ఏ ఒక్క సినిమా కూడ కమర్షియల్ గా సక్సస్ కాలేదు. 

అయితే ‘కంచె’ మాత్రం ఈ మెగా యంగ్ హీరోకు తో మంచి పేరు తెచ్చి పెట్టింది. కానీ ఈసినిమా ద్వారా వచ్చిన మంచి పేరు కూడ వరుణ్ తేజ్ కు కెరియర్ పరంగా ఏమాత్రం కలిసిరాలేదు. దీనితో ఎన్నో ఆశలు పెట్టుకుని శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించిన మిస్టర్ సినిమా కూడ ఘోరమైన పరాజయాన్ని పొందడంతో వరుణ్ తేజ్ కెరియర్ పై సందేహాలు మొదలయ్యాయి. 

టాలీవుడ్ విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఈ మెగా యంగ్ హీరోకి మాస్ రోల్స్ అంతగా కలిసిరావని అందువల్ల డిఫరెంట్ కథలతో సినిమాలు చేయకపోతే ఈ హీరో నిలబడటం కష్టం అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం వరుణ్ తేజ్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ అన్న సినిమాను చేస్తూ ఉన్నా ఈసినిమా పై పెద్దగా  అంచనాలు లేవు అని అంటున్నారు. 

ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో వరుణ్ తేజ్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నటిస్తున్న ‘ఫిదా’ సినిమా పూర్తి కాకుండానే ఈ యంగ్ హీరో వెంకీ అట్లూరి అనే కొత్త దర్శకుడితో వరుణ్ ఓ లవ్ స్టోరీ చేయడానికి రెడీ అవుతున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమా పనులు అయిపోయాయి అని టాక్. సంగీత దర్శకుడు తమన్ తో మ్యూజికల్ సిట్టింగ్స్ చేస్తూ దానికి సంబంధించిన ఫొటోను తన ట్విట్టర్లో షేర్ చేశాడు దర్శకుడు వెంకీ. ఇప్పటిదాకా వరుణ్ తో మీడియం రేంజి మ్యూజిక్ డైరెక్టర్లే పని చేశారు. 

తొలిసారి తమన్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ వరుణ్ తేజ్ సినిమాకు సంగీతాన్నందించబోతున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న వ్యక్తి కూడ మంచి రేంజి ఉన్నవాడే. తమిళంలో ‘కత్తి’ రాజా రాణి’ తెరి లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించిన జార్జ్ విలియమ్స్ వరుణ్ సినిమాకు ఛాయాగ్రహణం అందించబోతున్నాడు. దీనితో ఈ లవ్ స్టోరీ అయినా తనకు హిట్ ఇస్తుంది అన్న నమ్మకంతో వరుణ్ తేజ్ ఉన్నట్లు గా వార్తలు వస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: