అల్లుఅర్జున్ ‘దువ్వాడ జగన్నాథమ్’ తరువాత ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా తన దృష్టిని లేటెస్ట్ గా ప్రారంభించిన ‘నాపేరు సూర్య నాఇల్లు ఇండియా’ పై పెట్టాడు. రచయిత వక్కంతం వంశీ దర్శకుడుగా మారుతున్న ఈసినిమా కథ దేశభక్తి నేపధ్యంలో ఉంటుంది అన్న వార్తలు వస్తున్నాయి.

ఈసినిమాలో బన్నీ ఒక ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అయితే ఈమూవీలో బన్నీ తన లుక్ ను చాల డిఫరెంట్ గా కనిపించడానికి ఒక మాష్టర్ ప్లాన్ వేసినట్లు టాక్. సినిమాలోని పాత్ర స్వభావాన్ని బట్టి ఎప్పటికప్పుడు కొత్త లుక్ లో కనిపించే అల్లుఅర్జున్ ఈసినిమాలోని తన మిలటరీ ఆఫీసర్ పాత్రకు అమెరికా వెళ్లి రెండు నెలల పాటు కఠినమైన శిక్షణ తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనికోసం ఒక అమెరికాలోని ఒక ప్రముఖ బాడీ ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్ సలహాలతో ఈ రెండు నెలలు బన్నీ భారీ ఎక్స్ సైజ్ లు చేసి తన బాడీని ఒక కొత్త షేప్ లోకి తీసుకు రావడానికి కొంతమంది ఫిట్నెస్ నిపుణుల పర్యవేక్షణలో బన్నీ ఈ ప్రయోగం చేయబోతున్నట్లు టాక్. దీనికోసం ఈ వారాంతంలో అల్లుఅర్జున్ అమెరికా వెళ్ళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు బన్నీ ట్రై చేయబోయే ఈ లుక్ మునెప్పన్నడూ చూడని విధంగా సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది. 2018 సమ్మర్ ను టార్గెట్ చేస్తూ విడుదలకానున్న ఈ సినిమాకు విశాల్ శేఖర్ సంగీతం, ప్రముఖ సినిమాటోగ్రఫర్ రాజీవ్ రవి కెమెరా వర్క్ చేస్తుండగా బన్నీ సరసన మలయాళ బ్యూటీ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. రికార్డులు క్రియేట్ చేయాలి అని అల్లుఅర్జున్ చేసిన ప్రయత్నాలు ‘దువ్వాడ’ లో ఫెయిల్ అయిన నేపధ్యంలో ఈ కొత్త సినిమా ప్రాజెక్ట్ కోసం అల్లుఅర్జున్ చాల గట్టిగానే కష్ట పడుతున్నాడు అని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: