‘పోకిరి’ సినిమా మహేష్ బాబుకు ఎంతటి టర్నింగ్ ఇచ్చిందో ఐటమ్ గర్ల్ గా ముమైత్ ఖాన్ కు కూడా అంత కెరియర్ టర్నింగ్ ఇచ్చింది. ఈ సినిమా తరువాత ఐటమ్ సాంగ్ అంటే ముమైత్ ఖాన్ పేరు మాత్రమే కొన్ని సంవత్సరాలు వినిపించింది. ఆతరువాత టాలీవుడ్ లో ముమైత్ వేడి తగ్గి పోయింది. ఈ మధ్యనే విడుదలైన అల్లరి నరేష్ సినిమా ‘కేవ్వుకేక’ లో మళ్ళీ ముమైత్ తళుక్ మన్నా ఆమె అందాలు యూత్ ని ఆకర్షించ లేకపోయాయి.
ఇక లాభం లేదు అనుకుంది కాబోలు ఈ హాట్ బ్యూటి తన రూట్ మార్చి సినిమా దర్శకురాలి గా మారి మెగా ఫోన్ పట్టుకోవాలని అనుకుంటోoదని వార్తలు వస్తున్నై. ఈ నేపధ్యంలో తన కెరియర్ కు బ్రేక్ ఇచ్చిన పూరి జగన్నాద్ ను ఈ విషయమై సంప్రదిస్తే పూరి కూడా ముమైత్ ను ప్రోత్సహించడమే కాకుండా దర్శకత్వానికి సంబందించి కొన్ని టిప్స్ కూడా ఇచ్చాడట మాన పూరి ఈ సెక్సీ భామకు.
ఇంతవరకూ బాగానే ఉంది కానీ ప్రస్తుతం తన సినిమాలన్నీ వరసపెట్టి పరాజయం అవుతున్న స్పీడ్ లో ఉన్న పూరి ముమైత్ కు ఎటువంటి సలహాలు ఇచ్చాడు అన్నదే ఆ శక్తికరమైన విషయం. ముమైత్ తీయబోతున్న ఒక సరికొత్త కధాంశం తో ముమైత్ తీయబోతున్న ఈ కమర్షియల్ సినిమాలో ఎన్ని ఐటమ్ సాంగ్స్ ఉంటాయో చూడాలి ఇంతకీ పూరి ముమైత్ ను తన సలహాలతో ఏమి మాయచేసాడో తెలియాలి....
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి