జూనియర్ ఎన్టీఆర్ కు లైపోసక్షన్ ఆపరేషన్ జరిగింది అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న గాసిప్పులు జూనియర్ అభిమానులకు టెన్షన్ సృట్టిస్తున్నట్లు టాక్. అతేకాదు ఈ ఆపరేషన్ ద్వారా జూనియర్ శరీరం నుండి 5 కిలోల ఫ్యాట్ ను తొలగించారు అంటూ గాసిప్పులు కూడ హడావిడి చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం హడావిడి చేస్తున ఈ న్యూస్ ఎంత వరకు నిజం అన్నదాని పై క్లారిటీ లేకపోయినా హడావిడి చేస్తున ఈవార్తలు చాలామందికి అనేక సందేహాలు కలిగిస్తోంది.

జూనియర్ చాలాకాలం చాల లావుగా కనిపించినా రాజమౌళి ‘యమదొంగ’ సినిమా టైమ్ నుంచి ఎన్టీఆర్ ఫిట్ నెస్ బాడీతో కనిపిస్తూ వస్తున్నాడు. అయితే ‘జై లవ కుశ’ సినిమా కోసం మూడు పాత్రలు పోషించాల్సి రావడంతో అందులో తాను నటించిన రావణ పాత్ర కోసం వైవిధ్యం చూపించదానికి తన ఫిజిక్ లో కొంత మార్పులు చేసుకుని లావుగా కనిపించిన విషయం తెలిసిందే.

అయితే ‘జై లవ కుశ’ సినిమాలోని రావణ పాత్రకు మంచి పేరు వచ్చినా తిరిగి జూనియర్ ఇదే లావు అవతారాన్ని కొనసాగిస్తడా అన్న కామెంట్స్ కూడ వినిపించాయి. దీనికితోడు వచ్చే ఏడాది మార్చి నుండి ప్రారంభం కాబోతున్న జూనియర్ త్రివిక్రమ్ ల సినిమాలో కొత్త లుక్ ను ట్రై చేయాలని త్రివిక్రమ్ పట్టుపట్టడంతో జూనియర్ తన బరువుని తగ్గించుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.
![]()
దీనికితోడు ఈమధ్య గత కొద్దిరోజులుగా ఎన్టీఆర్ బయట ఎక్కడా కనిపించక పోవడంతో ఈ గాసిప్పులు ఇలా ప్రారంభం అయి ఉంటాయి అని మరికొందరు అంటున్నారు. అంతేకాదు మరికొందరైది అయితే జూనియర్ యాంటీ ఫ్యాన్స్ఇలాంటి రూమర్స్ పుట్టించి ఉంటారు అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా ఈ వార్తలలోని నిజాలు బయటకు రావాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాలి అన్నది మాత్రం వాస్తవం..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి