కొద్దిరోజుల క్రితం కారు యాక్సిడెంట్ వ్యవహారంలో హీరో నానీ పై రకరకాల నెగిటివ్ ప్రచారం జరిగిన విషయాలు తెలిసినవే. ఆ యాక్సిడెంట్ షాక్ నుండి తేరుకున్న నాని ఏమాత్రం సమయం వృథా చేయకుండా సరికొత్త వ్యూహంతో మీడియా ముందుకు వస్తున్నాడు. తాను నిర్మిస్తున్న ‘అ’ సినిమాకు విభిన్నంగా ప్రచారం చేయాలని వీలయినంత ఎక్కువ క్రేజ్ ఈసినిమాకు రాబట్టాలని నాని ఈ సినిమాకు సంబంధించి చాలవైవిధ్యంగా ప్రచారం మొదలు పెట్టబోతున్నాడు.

మొదట్లో ఈ సినిమాను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేద్దాము అని ప్రయత్నించిన నాని ఆతరువాత తన ఆలోచనలు మార్చుకుని లేటెస్ట్ గా ఫిబ్రవరి 16న రిలీజ్ డేట్ ప్రకటించాడు. దీనితో ఈసినిమాకు ఈలోపునే బాగా క్రేజ్ తీసుకురావడానికి నాని భారీ స్కెచ్ లు వేస్తున్నాడు. ఈసినిమాకు సంబంధించి ఈ నెల 31న ఒక భారీ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు సన్నహాలు చేస్తున్నాడు నాని.

ఇండస్ట్రీలో అజాతశతృవుగా పరిగణింపబడే నాని పిలిస్తే అందరూ వస్తారు కాబట్టి ఈమూవీ ఫంక్షన్ కు చాలమందిని ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫంక్షన్ కు రవితేజ కాజల్ తో పాటు రాజమౌళి కూడ వస్తున్నట్లు టాక్. దీనికితోడు ప్రభాస్ అనుష్కలతో పాటు సుమారు 15మంది టాప్ టాలీవుడ్ సెలబ్రిటీలు గెస్ట్ లుగా ఈఫంక్షన్ కు వస్తున్నట్లు సమాచారం. ఒక చిన్నసినిమాను ప్రమోట్ చేయడానికి ఇంతమంది సెలిబ్రిటీలు రావడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

అయితే ఫిబ్రవరి 16న మరో మూడుసినిమాలు సందీప్ కిషన్ ‘మనసుకు నచ్చింది’ మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’ ‘రాజరథం’ సినిమాలు కూడ షెడ్యూల్ అయిన నేపధ్యంలో నాని వ్యూహానికి షాక్ అవ్వకుండా ఎన్ని సినిమాలు నిలబడతాయి అన్నది మాత్రం ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న. ఇప్పటకే వరస విజయాలతో దూసుకుపోతూ టాప్ హీరోలను కూడ కలవరపాటుకు గురి చేస్తున్న నాని నిర్మిస్తున్న ఈ ‘అ’ సినిమా విజయం సాధిస్తే ఇటు హీరోగా అటు నిర్మాతగా నాని ద్విపాత్రాభినయం మరింత వేగం పెరిగే ఆస్కారం ఉంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి