గతంలో నటన అంటే సమాజంలో చిన్నచూపు ఉండేది. దీనితో నటన వృత్తిగా తీసుకోవడానికి జనం పెద్దగా ముందుకు వచ్చేవారు కాదు. ముఖ్యంగా మహిళలు నటనకు చాలా దూరంగా ఉండేవారు. అలాంటి రోజుల్లో నటనలో ప్రవేశించిన నటి కమలాదేవి.
నటిగా, గాయనిగా, డబ్బింగ్ అర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంది కమలాదేవి. తెలుగు, తమిళ బాషల్లో సుమారు 50 సినిమాలలో నటించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరానికి చెందిన టి.జి.కమలాదేవి అసలు పేరు గోవిందమ్మ. సినిమాలోకి రాక మునును అమె రంగస్థలంపై మహిళా పాత్రలతో పాటు పురుష పాత్రలు కూడా పోషించి పేరు తెచ్చుకున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: