జూనియర్ ఎన్టీర్ రామ్ చరణ్ లు రాజమౌళి త్వరలో ప్రారంభించబోతున్న మల్టీ స్టారర్ లో నటించడానికి ముందే తమ మధ్య స్నేహ బంధాన్ని మరింత పెంచుకోవడానికి త్వరలో వీరిద్దరూ కలిసి విదేశాలలో ఒక హాలిడే ట్రిప్ కు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ హాలిడే ట్రిప్ సలహాను దర్శకుడు రాజమౌళి ఇచ్చినట్లు తెలుస్తోంది.
RAJAMOULI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
రాజమౌళి త్వరలో ప్రారంభిస్తున్న మూవీలో చరణ్ జూనియర్ లు అన్న దమ్ములుగా కనిపించబోతున్న నేపధ్యంలో వీరిద్దరి మధ్య సహజ సిద్ధమైన సాన్నిహిత్యం పెరగడానికి ఈ హాలీడే ట్రిప్ బాగా ఉపయోగ పడుతుందని రాజమౌళి అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు రాజమౌళి కూడ ఈ హాలీడే ట్రిప్ లో జాయిన్ అయి చరణ్ జూనియర్ లతో మరింత సాన్నిహిత్యాన్ని పెంచుకుని తద్వారా తన మల్టీ స్టారర్ విషయంలో జూనియర్ చరణ్ ల మధ్య ఎటువంటి ఇగో సమస్యలు లేకుండా సజావుగా షూటింగ్ సాగడానికి ఈ హాలిడే ట్రిప్ ను ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 
JUNIOR NTR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
తెలుస్తున్న సమాచారం మేరకు ఈ హాలిడే ట్రిప్ జూనియర్ భార్య లక్ష్మి ప్రణతి డెలివరీ అయిన తరువాత ఈ ట్రిప్ ఉంటుందని అంటున్నారు. ఈ హాలిడే ట్రిప్ లో నిజమైన సొంత అన్నదమ్ములులా చరణ్ జూనియర్ ల మధ్య సాన్నిహిత్యం పెరిగితే ఆ కెమిస్ట్రీ సహజంగా తాను తీయబోతున్న మల్టీ స్టారర్ లో కూడ కనిపించి తన మూవీ ఘనవిజయానికి జూనియర్ చరణ్ ల మధ్య సాన్నిహిత్యం అదేవిధంగా పెరిగిన ప్రేమ తమ నటనలో సహజత్వానికి దగ్గరగా ప్రతిబింబిస్తుంది అని రాజమౌళి స్కెచ్ అని అంటున్నారు. 
RAJAMOULI MALTI STARER WITH CHARAN AND JUNIOR కోసం చిత్ర ఫలితం
అంతేకాదు రాజమౌళి తీయబోతున్న ఈ భారీ మల్టీ స్టారర్ లో గతంలో చరిత్ర సృష్టించిన ‘షోలే’ సినిమాలోని ధర్మేంద్ర అమితాబచన్ లు సహజమైన నటనలో కనిపించిన విధంగా చరణ్ జూనియర్ లు కూడ ఎటువంటి అరమరికలు మరియు భేషజాలు లేకుండా కనిపించాలని చరణ్ జూనియర్ లకు ఒక వర్క్ షాప్ గా ఈ హాలిడే ట్రిప్ ను మార్చాలని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రీన్ ప్లే కూడ పూర్తి అయిన సందర్భంలో ఈమూవీలోని మిగతా పాత్రల కోసం రాజమౌళి తన అన్వేషణ మొదలు పెట్టినట్లు కూడ వార్తలు వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: