మెగా అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న ‘రంగస్థలం’ సక్సస్ మీట్ డేట్ తో పాటు స్థలం కూడ ఫిక్స్ అయింది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో ఈ సక్సస్ మీట్ ను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారక ప్రకటన కూడ విడుదల అయింది. 
RANGASTHALAM MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ ఫంక్షన్ ను యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నారు. సినిమాలకు సక్సస్ మీట్ నిర్వహించడం సర్వసాధారణమే అయినా ఒక ఓపెన్ గ్రౌండ్ లో ఈసభను నిర్వహిస్తూ పవన్ కళ్యాణ్ ను అతిధిగా రప్పించుకోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన చరణ్ మెగా పవర్ ను సూచించే విధంగా ఈ సక్సస్ మీట్ ను నిర్వహించబోతున్నారని టాక్.
RANGASTHALAM MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సక్సస్ మీట్ కు పవన్ తో పాటు చిరంజీవి కూడ వస్తున్నట్లు తెలుస్తోంది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో ఫంక్షన్ తరువాత తిరిగి పవన్ చిరంజీవిలు ఒకే వేదిక పై కనిపించిన సందర్భాలు లేకపోవడంతో ఈ ఫంక్షన్ మెగా అభిమానులకు పండుగగా మారబోతోంది. మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్న దర్శకులు నిర్మాతలు అంతా ఈ ఫంక్షన్ కు రాబోతున్నారు. 
RANGASTHALAM MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
వాస్తవానికి ఈ సక్సస్ మీట్ ను భాగ్యనగరంలోని నోవాటెల్ హోటల్ లో పెట్టాలనుకున్నట్లు తెలుస్తోంది. కానీ భద్రతాపరమైన కారణాల వల్ల ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గినట్లు టాక్. ఆతర్వాత ఈ ఫంక్షన్ ను అమరావతిలో పెట్టాలనీ ప్రయత్నాలు జరిగినా అనేక కారణాలు వల్ల ఇప్పుడు హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీసు గ్రౌండ్ కు మార్చినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఏసినిమాలు పోటీ లేకపోవడంతో ‘రంగస్థలం’ 150 కోట్ల సినిమాగా మారడం ఖాయం అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: