నాచురల్ స్టార్ గా ఇయర్ కు 3 సినిమాలను చేస్తూ వాటిని కూడా హిట్లు కొడుతున్న నాని ఈ ఇయర్ కృష్ణార్జున యుద్ధంతో తన హిట్ మేనియా మొదలు పెట్టాలని భావించాడు కాని సీన్ రివర్స్ అయ్యింది. మేర్లపాక గాంధి డైరక్షన్ లో వచ్చిన కృష్ణార్జున యుద్ధం నాని సినిమా రేంజ్ కలక్షన్స్ తీసుకురాలేదు. ఫలితంగా సినిమా నష్టాలు తెచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


సినిమా టాక్ కూడా అంత బాగా ఏం రాలేదు. అయితే సినిమా పోవడం వల్ల ఆలోచనలో పడిన నాని రాబోయే సినిమాల కథల మీద దృష్టి పెట్టాడు. ప్రస్తుతం నాగార్జునతో మల్టీస్టారర్ మూవీ చేస్తున్న నాని విక్రం కె కుమార్ సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుందట.


విక్రం కుమార్ సినిమా అంటే చాలా స్పెషల్ గా ఉంటాయి. 24 అంటూ సూర్యతో ప్రయోగం చేసిన విక్రం కె కుమార్ ఇప్పుడు నానితో కూడా అలాంటి ప్రయోగమే చేస్తున్నాడట. 24 లాంటి థ్రిల్లర్ కథ నాని కోసం రాసుకున్నాడట. రెగ్యులర్ సినిమాలు చేసిన నానికి ఈ కథ బాగుంటుందని అనిపించి ఓకే చెప్పాడట. 


కృష్ణార్జున యుద్ధం టాక్ వేరేగా రావడం వల్ల నాని జాగ్రత్తలో పడ్డాడు. ఎలాంటి సినిమా తీసినా సరే ఆడియెన్స్ చూసే రోజులు పోయాయి. స్టార్స్ కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది. మరి నాని ఈ విషయాన్ని త్వరగానే కనిపెట్టాడు కాబట్టి సినిమా ల హిట్ మేనియా కొనసాగిస్తాడేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: