‘సైరా’ మూవీ టీజర్ కు విపరీతమైన స్పందన రావడంతో ఈ స్పందన దర్శకుడు సురేంద్ర రెడ్డికి మంచి జోష్ ను ఇస్తోంది. దీనితో ఈమూవీని అనుకున్న సమయానికి పూర్తి చేసి ఎట్టి పరిస్తుతులలోను వచ్చే ఏడాది సమ్మర్ కు విదుల చేయాలి అన్న ధృడ సంకల్పంతో ‘సైరా’ టీమ్ పరుగులు తీస్తోంది. 

ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ యూనిట్ తన షెడ్యూల్ ను వేగంగా పూర్తి చేసి ఈసినిమాకు సంబంధించి ఒక కీలక షెడ్యూల్ షూటింగ్ కోసం విదేశాలలోని రకరకాల ప్రదేశాలను అన్వేషించినట్లు తెలుస్తోంది. అనేక వడపోతల తరువాత మెగా కాంపౌండ్ జార్జియాకు ఓటు వేసినట్లు సమాచారం. 
megastar chiranjeevi starrer sye raa narasimha reddy teaser released
ఇలా మెగా కాంపౌండ్ జార్జియాను ఎంపిక చేయడం వెనుక ఒక కారణం ఉంది. జార్జియా దేశంలో షూటింగ్ కు అక్కడ ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు బాగా ఉండటమే కాకుండా ఆదేశంలో షూటింగ్ చేసే నిర్మాతలకు ఆర్ధికంగా అనేక ప్రోత్సాహాలు కూడ ఇస్తారు. దీనికితోడు ఆదేశంలో ఉండే పురాతన భవనాలు కొండలు యుద్ధ సన్నివేశాల చిత్రీకరణకు ఎంతగానో సహకరిస్తాయి. 
సైరా టీజర్‌కు సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
ఈవిషయాలు అన్నే పరిగణలోకి తీసుకుని మెగా కాంపౌండ్ సలహాతో ‘సైరా’ వార్ సీన్స్ ఎపిసోడ్ కు జార్జియాను ఎంపిక చేసినట్లు సమాచారం. దీనికితోడు జార్జియాలో తీసిన ‘కంచే’ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ గరుడవేగా’ మూవీలు హిట్ కావడంతో ఆ హిట్ సెంటిమెంట్ ‘సైరా’ కు కూడ బాగా పనికి వస్తుందని మెగా కాంపౌండ్ నమ్మకం అని అంటున్నారు. ఒకవైపు ‘సైరా’ మూవీ బడ్జెట్ విషయంలో ఎటువంటి పరిమితులు లేవు అంటూ కామెంట్స్ చేస్తున్న చరణ్ మరొక వైపు ఈమూవీ ఖర్చును తగ్గించడానికి అనుసరిస్తున్న వ్యూహాలు చరణ్ లోని వ్యాపార వేత్తను మరొకసరి గుర్తుకు చేస్తున్నాయి..
 


మరింత సమాచారం తెలుసుకోండి: