నిర్భయ చట్టం వచ్చినా మన దేశంలో స్త్రీలపై అత్యాచారాలు ఆగటం లేదు. ఈ అత్యాచారాల బాధితుల కధలను కధాంశాలుగా తీసుకుని అనేకసినిమాలు వస్తున్నాయి. అటువంటి కధతో ఒకనాటి హీరోయిన్ శ్రీప్రియ నిత్యామీనన్ ను హీరోయిన్ గా పెట్టి ఓ మళయాళ రీమేక్ ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 22 Female Kottayam అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం తమిల,తెలుగు భాషల్లో రీమేక్ అవుతోంది. ఇక ఈ చిత్రం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంగా రూపొందుతోంది. తనను మోసం చేసిన వారిపై హీరోయిన్ తీర్చుకునే పగ,ప్రతీకారం ప్రధానాంసంగా ఈ సినిమా కధాంశం.
మళయాళంలో ఈ చిత్రం సూపర్ హిట్ ఈ చిత్రం కోసం నిత్యామీనన్ పై బలాత్కార సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలోనే ముంబయిలో మహిళ ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం జరగడం దిగ్భ్రాంతిని కలిగించిందని నిత్యామీనన్ పేర్కొంది. అసలు నిత్యా ఆ రేప్ సీన్ లో నటించడానికి చాల సంకోచించాననీ నటనకే అంత కష్టమైన ఆ సీన్ చేస్తున్నప్పుడు భారతదేశంలో ఎందరో మహిళలు పడుతున్న బాధ గుర్తుకువచ్చి నటించానని చెపుతూ నిత్య ఆ మానసిక బాధ ఏమిటో తనకు తెలిసి వచ్చిందని చెప్పింది. అయితే మహిళా దర్శకురాలి దర్శకత్వంలో నటించడం వలన తన సంకోచం పోయిందని అంటూ మహిళలపై బలాత్కారానికి పాల్పడేవారు ఈ చిత్రం చూస్తే అలాంటి చర్యలకు పాల్పడరని అంది.
ఈ చిత్రం విడుదలైన తర్వాత మానవ మృగాల్లో తప్పకుండా మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది నిత్య. నిత్యామీనన్ కి తెలుగులోనూ, తమిళంలోనూ ఉన్న మార్కెట్ రీత్యా ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ 22 Female Kottayam చిత్రం వర్మ రూపొందించిన ఏక్ హసీనా థీ చిత్రం ప్రేరణతో తయారైంది. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నమైన కథాంశం కావడంతో ఇది తన కెరీర్‌కు ప్లస్సవుతుందని నిత్యామీనన్ ఆశిస్తోంది. మంచి నటిగా పేరున్న నిత్యామీనన్ ఇటువంటి పాత్రను ఒప్పుకుని చేయడం సాహసమే. ఆ సాహసానికి ప్రేక్షకులు ఏతీర్పు ఇస్తారో చూడాలి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి