‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న కార్తీకేయకు అదే మొదటి సినిమా అని చాలామంది అనుకున్నారు. అయితే వాస్తవానికి ఈహీరో గతంలో ‘ప్రేమతో మీ కార్తీక్’ వంటి ఒకటి రెండు చిన్న సినిమాలలో నటించినా ఆసినిమాలు ఏవీ విజయవంతం కాకపోవడంతో కార్తీకేయకు గతంలో ఏమాత్రం గుర్తింపు రాలేదు. 

ఇలాంటి పరిస్థుతులలో కార్తికేయకు ‘ఆర్ ఎక్స్ 100’ ఊహించని టర్నింగ్ ఇచ్చింది. దీనితో చాలామంది దర్శక నిర్మాతలు కార్తికేయ డేట్స్ కోసం ఎగపడుతున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ఈయంగ్ హీరో ఒక అనుకోని వివాదంలో చిక్కుకుని హాట్ టాపిక్ గా మారాడు. ‘సుపారి’ అనే టైటిల్ తో కార్తికేయ ఒకసినిమా చేస్తున్నాడు అంటూ ఆమూవీ నిర్మాతలు లేటెస్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి ఆసినిమా విషయాలను వివరించారు. 
Kartikeya Gummakonda Wiki
అయితే ఆసినిమాలో తాను నటించలేదు అంటూ కార్తికేయ తన ట్విటర్ ద్వారా అందరికీ తెలిసేలా ప్రకటన చేసాడు. వాస్తవానికి ఈ ‘సుపారి’ విషయంలో జరిగిన విషయం వేరు. అప్ కమింగ్ హీరోలు అవకాశాల కోసం నటిస్తున్నప్పుడు కొంతమంది దర్శకులు ఆ అప్ కమింగ్ హీరోల పై డెమో షూట్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సందర్భమే ‘సుపారి’ విషయంలో కార్తేయకు ఎదురైందని అంటున్నారు. 
Image may contain: 1 person, beard
తన కెరియర్ ప్రారంభంలో కార్తికేయ కొన్నిరోజుల పాటు నటించిన ఒక డెమో షూట్ ను సినిమాగా మార్చి కొంత మార్పులు చేర్పులతో ‘సుపారి’ గా మార్చారని కార్తికేయ వాదాన. అయితే అప్ కమింగ్ హీరోలు ఒక సినిమా సక్సస్ తో క్రేజీ హీరోలుగా మారిన తరువాత తాము గతంలో నటించిన ఇమేజ్ లేని సినిమాలు తమవి కావు అని చెప్పుకోవడం ఒక అలవాటుగా మారింది కాబట్టి ఇదే పద్ధతిని కార్తికేయ సుపారి విషయంలో అనుసరిస్తున్నాడు అంటూ మరికొందరి వాదన. ఎది ఎలా ఉన్నా కార్తికేయ కెరియర్ ప్రారంభంలోనే నెగిటివ్ వార్తలు రావడం అతడి కెరియర్ కు దెబ్బ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  మరింత సమాచారం తెలుసుకోండి: