ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ అదేవిధంగా అల్లు అర్జున్ లు ఒకే సెంటిమెంట్ ను నమ్ముకుని ఇప్పుడు తమ భవిష్యత్ సినిమాలకు సంబంధించిన పధకాలను రచిస్తూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు బన్నీ తన సినిమాలకు సంబంధించిన చర్చలు అదేవిధంగా ఆమూవీలకు సంబంధించిన దర్శకులు చెప్పే కథలను వినే కార్యక్రమాలను బన్నీ తన తండ్రి గీతా ఆర్ట్స్ ఆఫీసులో చేస్తూ ఉండేవాడు. 
AlluArjun Fans
అయితే ‘నాపేరు సూర్య’ ఘోర పరాజయం తరువాత షాక్ లోకి వెళ్ళిపోయిన బన్నీ చాల గ్యాప్ తీసుకుని ప్రస్తుతం అతడు అత్యంత విలాసవంతంగా నిర్మించుకున్న ‘AA’ కు సంబంధించిన రెండు అంతస్తుల ఆఫీసులో ప్రస్తుతం దర్శకులు చెపుతున్న కథలను వింటున్నాడు. అదేవిధంగా త్రివిక్రమ్ కూడ తన ‘అజ్ఞాతవాసి’ కి సంబంధించి గతంలో కార్యకలాపాలు నిర్వహించిన ఆఫీసు నుండి కాకుండా బంజారాహిల్స్ లో కళ్యాణ్ రామ్ ఆఫీసుకు దగ్గరలో ‘అరవింద సమేత’ కు సంబంధించి ఒక కొత్త ఆఫీసును తీసుకుని అక్కడ నుండే ఈమూవీ బిజినెస్ కార్యకలాపాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. 
Is Trivikram Srinivas Quitting Films?  
దీనితో ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ లు తమ సినిమాల వ్యూహాలకు సంబంధించి మార్పులు చేసుకుని ఏర్పాటు చేసుకున్న కొత్త ఆఫీసులు వీరిద్దరికీ ఎంత అదృష్టాన్ని కలిగిస్తాయి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. దీనికితోడు ‘అరవింద సమేత’ బ్లాక్ బస్టర్ హిట్ అయితే త్రివిక్రమ్ తో చేయి కలపాలి అని బన్నీ భావిస్తున్న నేపధ్యంలో ‘అరవింద సమేత’ సక్సస్ గురించి అల్లు అర్జున్ కూడ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. 
Director-Vikram-Kumar
ఈపరిస్తుతులు ఇలా ఉండగా కొద్ది రోజుల క్రితం దర్శకుడు విక్రమ్ కుమార్ తాను ఇప్పటికే బన్నీకి చెప్పిన కధకు మార్పులు చేర్పులు చేసి బన్నీ నుండి గ్రీన్ సిగ్నల్ పొందినట్లు టాక్. అయితే ‘అరవింద సమేత’ హిట్ అయితే బన్నీ త్రివిక్రమ్ ల కాంబినేషన్ ఒకవేళ ఈమూవీ అనుకున్న అంచనాలు చేరుకోలేకపోతే అల్లు అర్జున్ విక్రమ్ కుమార్ ల ఫిక్స్ కాబోతున్న నేపధ్యంలో ‘అరవింద’ రిజల్ట్ విక్రమ్ కుమార్ కు కూడ కీలకంగా మారుతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: