ఆగష్టు 15 రిలీజ్ డేట్ ను ప్రకటించుకుని ఆ డేట్ కు ఎట్టి పరిస్తుతులలోను విడుదల అయి తీరాలి అని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ‘సాహో’ యూనిట్ కు ఊహించని షాక్ తగిలింది. ఈసినిమా సంగీత దర్శకత్వం బాధ్యతల నుండి తాము తప్పుకుంటున్నట్లుగా ఈమూవీ సంగీత దర్శకులు శంకర్ ఎహసాన్ లాయ్ లు తమ ట్విటర్ లో అధికారికంగా తెలియచేసారు. 

దీనితో ఈసినిమాకు సంగీత దర్శకత్వం వహించే బాధ్యతలను తమన్ తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నా ఇంత భారీ బడ్జెట్ సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకులు మెచ్చే విధంగా తమన్ ఈమూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వగలడా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. వాస్తవానికి ప్రభాస్ ఏరికోరి ఈమూవీకి శంకర్ ఎహసాన్ లాయ్ లను ఎంపిక చేసుకున్నాడు. 

అయితే ఇప్పటి వరకు వీరు స్వరపరిచిన మూడు పాటలు క్లాసిక్ టచ్ తో హిందూస్తానీ స్టైల్ తో ఉండటం ప్రభాస్ సుజిత్ లకు నచ్చలేదు అని తెలుస్తోంది. దీనితో మిగిలిన రెండు పాటలను కాస్త మాస్ టచ్ తో చేయమని ప్రభాస్ చేసిన ఒత్తిడి శంకర్ ఎహసాన్ లాయ్ లకు నచ్చకపోవడంతో క్రియేటివ్ డిఫరెన్స్ కారణాలతో ఈముగ్గురు ‘సాహో’ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఈమూవీని అంతా హాలీవుడ్ స్టైల్ లో తీస్తున్నారు. దీనితో ఈమూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు ఈమూవీ రీ రికార్డింగ్ విషయంలో సౌండ్ ఎఫెక్ట్స్ చాల కీలకం. ఇలాంటి పరిస్థుతులలో ఇంత కీలక బాధ్యతలను ఇంత తక్కువ సమయంలో తమన్ ఎత్తుకోగలడా అన్న సందేహాలు ఉన్నా ప్రస్తుత పరిస్థితులలో తమన్ తప్పించి మరొక పరిష్కారం ‘సాహో’ నిర్మాతల చేతిలో లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: