అక్కినేని కుటుంబ కధాచిత్రంగా ఈ మధ్యనే డిఫరెంట్ ఫస్ట్ లుక్ తో అక్కినేని అభిమానులను సందడి చేసిన మనం సినిమాలో మంచువారి హీరో విష్ణు ఒక ప్రముఖ పాత్రను పోషిస్తున్నాడు అంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు హడావుడి చేస్తున్నాయి. అంతేకాదు హీరో నాగార్జున తో కలిసి మంచు విష్ణు ఈ విషయాన్ని ఒక ప్రెస్ మీట్ లో అతి త్వరలో తెలియజేస్తాడు అని కూడా అంటున్నారు. ఈ మధ్యనే 90 వ వసంతంలోకి అడుగుపెట్టిన అక్కినేని, నాగార్జున, నాగచైతన్య లతో పాటు మంచు విష్ణు కూడా ఈ సినిమాలో నటిస్తూ ఉండడంతో అక్కినేని – మంచు వారి కుటుంబ సినిమాగా మనం మారబోతోంది అని అనుకోవాలి.

‘ఇష్క్’ సినిమాకు దర్శకుడుగా పనిచేసి, ఇప్పటివరకూ ఏ సినిమాకు పనిచెయ్యకుండా కేవలం తన ద్రుష్టి ని అంతా మనం స్క్రిప్ట్ పైనే ఉంచిన విక్రం కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటూ ఇప్పటికే టాక్ అస్ ది టాలీవుడ్ గా ఈ సినిమా మారింది. హీరో నాగార్జున కూ, మంచు విష్ణు కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో విష్ణు హీరోగా నటించిన ‘కృష్ణార్జున’ సినిమాలో నాగార్జున ఒక ప్రత్యేక పాత్రను పోషించాడు. ఇది ఇలా ఉండగా హీరో నాగార్జున కూడా విష్ణు నటిస్తున్న ‘దూసుకేళ్తా’ సినిమాలో కొద్ది క్షణాలు కనిపిస్తాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ రెండు వార్తలలో ఏది నిజం అన్నది అతి త్వరలో నాగార్జున – విష్ణు లు ఏర్పాటు చెయ్యబోతున్న ప్రెస్ మీట్ లో క్లారిటీ వస్తుంది అని అంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: