జరిగిన ఎన్నికలలో కనీసం తనని తాను గెలిపించుకో లేకపోయిన పవన్ కళ్యాణ్ మరొకసారి పోటానికి సిద్దం అవుతూ ఈరోజు విజయవాడలోని ‘జనసేన’ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘జనసేన’ ముఖ్య నేతల సమావేశం మీడియాకు హాట్ న్యూస్ గా మారింది. ఈ సమావేశానికి రావలసిందిగా ఎన్నికలలో 137 స్థానాలలో పోటీ చేసిన అభ్యర్ధులు అందరికీ మెసేజ్ లు వెళ్ళినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇప్పటికే ‘జనసేన’ నుండి పోటీ చేసి విజయం సాధించిన రాజోలు ఎమ్ ఎల్ ఏ రాపాక వరప్రసాద్ వైఎస్ఆర్ సి పార్టీలో చేరడం ఖాయం అయిన నేపధ్యంలో పవన్ పిలుపుకు జరిగిన ఎన్నికలలో 120 స్థానాలలో డిపాజిట్లు కోల్పోయిన అభ్యర్ధులు ఎంతమంది ఈరోజు సమావేశానికి వస్తారు అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో ఎంత తక్కువమంది ఈనాటి సమావేశానికి వచ్చినా పవన్ తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లు సమాచారం.

మరి కొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న మునిసిపల్ పంచాయితీ ఎన్నికలలో ‘జనసేన’ తన అభ్యర్ధులను నిలబెడుతుందనీ కీలక ప్రకటన చేయబోతున్నట్లు టాక్. అంతేకాదు గడిచిన ఎన్నికలలో అభ్యర్ధుల నుండి డబ్బు తీసుకోకుండా ఓట్లు కొనుక్కోవడానికి డబ్బు పంచకుండా పోటీ చేసిన తమ పార్టీకి సుమారు 20 లక్షలు ఓట్లు రావడం జనం తిరస్కరణ ఎలా అవుతుంది అనీ పవన్ ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది. 

దీనితో ఓటమికి తల ఒగ్గి పవన్ జనానికి దూరంగా ఉంటున్నాడు అన్న అపవాదును తొలిగించుకోవడమే కాకుండా 2024 ఎన్నికలలో ప్రజలకు దగ్గర కాగల శక్తీ తమకు మాత్రమే ఉంది అంటూ సంకేతాలు ఇవ్వడానికి పవన్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈరోజు పవన్ నిర్వహించబోతున్న కీలక సమావేశం ఫలితం బట్టి పవన్ కళ్యాణ్ భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: