ప్రస్తుతం దీపికా పడుగోనే లక్ వెనుతిరగ కుండ పరుగెడుతోంది. ఈ సంవత్సరం ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం బాలీవుడ్ లో 500 కోట్ల హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజినీ చేత వ్యక్తిగతంగా పిలిపించుకుని ‘కొచ్చాడియన్’ సినిమాలో రజినీ ప్రక్కన నటించే క్రెడిట్ కొట్టేసింది. అయితే ఈ సినిమా దర్శకురాలు రజనీ కూతురు సౌందర్య మాత్రం దీపిక పేరు చెపితే మండి పడిపోతోందట. దీనికి కారణం ‘కొచ్చాడియన్’ సినిమాలో మొదటిగా దీపిక కాల్ షీట్స్ ఎక్కువ రోజులు అవసర పడతాఎమో అని దర్శకురాలు సౌందర్య భావిచిందట. కానీ ఈ సినిమా యానిమేషన్ సినిమా కావడంతో ఈ సినిమాలో దీపిక పని మూడు రోజులతో ముగిసి పోయిందట.
అనుకున్న రౌజులకన్నా దీపిక వర్క్ ఈ సినిమాలో తొందరగా అయిపోవడంతో ఆమె పారితోషికాన్ని కొద్దిగా తగ్గించుకోమని రజినీ కూతురు కోరిందట. కానీ డబ్బు విషయం దగ్గర ఖచ్చితంగా ఉండే దీపిక తన పారితోషికాన్ని తగ్గించుకోలేను అని చెప్పిందట. దీనితో చిర్రెత్తుకోచ్చిన సౌందర్య దీపిక పై కోపంతో దీపిక ‘కొచ్చాడియన్’ సినిమాలో తన పాత్రకు తమిళం లో తాను డబ్బింగ్ చెప్పుకుంటాను అని చెప్పినా మరొకరిచేత దీపిక పాత్రకు డబ్బింగ్ చెప్పించి తన కోపాన్ని తీర్చుకుందట. సూపర్ స్టార్ కూతురి నే లెక్క చేయని బ్యూటీ గా దీపిక మరో రికార్డును సొంతం చేసుకుంది...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి