మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 3షో ఇంకా ప్రా రంభం కాకుండానే వివాదాలకు చిరునామాగా మారుతోంది. ఈ షో పార్టిసిపెంట్స్‌గా పలువురు ప్రముఖ సెలిబ్రిటీల పేర్లు బయటకు వస్తున్న నేపధ్యంలో ఈ షోలో పాల్గొనే సెలెబ్రెటీల పేర్లు ఇంకా అధికారికంగా ప్రకటన చేయకుండానే యాంకర్‌ జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి ‘బిగ్ బాస్’ నిర్వాహకుల పై విరుచుకు పడుతూ ‘బిగ్ బాస్’ బాగోతం బయట పెడతాను అంటూ చెప్పిన విషయాలు సంచలనం సృట్టిస్తున్నాయి. 

నిన్న హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన శ్వేతారెడ్డి ఈ షో నిర్వాహకుల తీరుపై అనేక సంచలన కామెంట్స్ చేసింది. ‘బిగ్ బాస్’ పేరుతో ఆ షో యాజమాన్యం మహిళలను లొంగదీసుకుంటోందని శ్వేతారెడ్డి సంచలన  ఆరోపణలు చేసింది. బిగ్ బాస్ హౌస్‌లో కాస్టింగ్ కౌచ్ అరాచకాలు కొనసాగుతున్నాయని తన ఎంపికకు సంబంధించి ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించింది శ్వేతారెడ్డి.

బిగ్ బాస్ లో తనను ఎంపిక చేసిన విషయాన్ని ఆ షో నిర్వాహకులు తనకు ఫోన్ చేసి చెప్పిన విషయాన్ని తెలియచేస్తూ తనను ఆఫీస్ కు రప్పించుకుని  కొన్ని  కాగితాల పై సంతకాలు తీసుకున్న విషయాన్నిశ్వేతారెడ్డ్డి తెలియ చేసింది.  ఈ షో నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కొందరు తనను  బిగ్ బాస్‌ ని ఎలా ఇంప్రెస్‌ చేస్తారు? అని అడిగిన విషయాని వివరించింది.  దానికి తానూ ఎందుకు  ఇంప్రెస్‌ చెయ్యాలి అని నిలదీయడంతో కమిట్ మెంట్ ఇవ్వాలని కొందరు బిగ్ బాస్ షోకు సంబంధించిన వారు డిమాండ్ చేశారంటూ శ్వేతారెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. 

అంతేకాదు ‘బిగ్ బాస్’ నిర్వాహకుల బాగోతాలు చాలా ఉన్నాయని గతంలో చాలా మందితో ఇలాగే కమిట్‌మెంట్ తీసుకున్నారని శ్వేతారెడ్డి ఆరోపణలు చేస్తోంది.  తాను  ఆ వివరాలన్నీ సేకరించానని వాళ్ళ విషయాలను  త్వరలోనే బయట పెడతాను అంటూ శ్వేతా రెడ్డి తన సంచలన వ్యాఖ్యలకు మరింత పదును పెట్టింది. అదేవిధంగా తాను   సంతకం చేసిన డాకుమెంట్లు ఇవ్వకుండా కొందరు బిగ్ బాస్ షో కి సంభందించిన వ్యక్తులు జిమ్మిక్కులు చేస్తున్నారని ఈమె చేసిన ఆరోపణలు ఇప్పడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం మీడియాకు ఈవిషయం హాట్ టాపిక్ గా మారిన నేపధ్యంలో ఈ షోను నిర్వహిస్తున్న నాగార్జున దృష్టి వరకు ఈ వివాదాలు వెళ్ళినట్లు టాక్. దీనితో ఎలర్ట్ అయిన నాగార్జున ఈవార్తలలోని నిజాలు ఎన్న అన్న విషయాలు సేకరించి ఈషో నిర్వాహకుల పై తీవ్ర అసహనాన్ని వ్యక్త పరిచినట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: