-
anil ravipudi
-
Baadshah
-
Badshah
-
bandla ganesh
-
Cinema
-
Comedian
-
Congress
-
Gabbar Singh
-
harish shankar
-
Makar Sakranti
-
Manam
-
media
-
nandamuri taraka rama rao
-
News
-
NTR
-
parasuram
-
PAWAN
-
Pawan-Kalyan
-
puri jagannadh
-
Rajani kanth
-
Ram Charan Teja
-
ravi teja
-
Sachin
-
sankranthi
-
Sankranti
-
Sarileru Neekevvaru
-
Temper
-
Tollywood
టాలీవడ్ సినిమా పరిశ్రమకు మొదట కమెడియన్ గా అక్కడక్కడా సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్ లో నటించిన బండ్ల గణేష్, ఆ తరువాత మెల్లగా ఆర్ధికంగా కొద్దిగా స్థిరపడి నిర్మాతగా మారడం జరిగింది. మొదట 2009లో రవితేజ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్, తొలిసినిమా తోనే పరాజయాన్ని మూటగట్టుకోవడం జరిగింది. ఆ తరువాత పవన్ హీరోగా ఆయన నిర్మించిన తీన్ మార్ సినిమా కూడా అతి పెద్ద డిజాస్టర్ అవడంతో, గణేష్ కొంత ఆలోచనలో పడ్డారు. ఆపై మరొక్కసారి పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ సినిమాను నిర్మించారు బండ్ల గణేష్. అయితే అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఆ సినిమా, నిర్మాతగా గణేష్ కు మంచి బ్రేక్ ని ఇచ్చింది.
అనంతరం ఎన్టీఆర్ తో చేసిన బాద్షా హిట్ కొట్టగా, దాని తరువాత బన్నీతో ఇద్దరమ్మాయిలతో, సచిన్ జోషితో నీ జతగా నేనుండాలి, రామ్ చరణ్ తో గోవిందుడు అందరి వాడేలే సినిమాలు తీసి, మూడు ఘోర పరాజయాలు చవి చూసారు. ఇక 2015లో మరొక్కసారి ఎన్టీఆర్ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన టెంపర్ సినిమా సూపర్ హిట్ సాధించింది. అయితే టెంపర్ సినిమాతో సినీ నిర్మాణానికి ఫుల్ స్టాప్ పెట్టిన బండ్ల, సడన్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కొన్నాళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అప్పట్లో, రానున్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం, టిఆర్ఎస్ ఘోరంగా ఓటమిపాలవడం ఖాయమని, ఆలా జరగకపోతే తన గొంతుకను బ్లేడ్ తో కోసుకుంటానని బండ్ల పెద్ద ఛాలెంజ్ చేసి సంచలనాన్ని సృష్టించారు. అయితే అనూహ్యంగా ఆ ఎన్నికల్లో టిఆర్ఎస్ అద్భుత విజయాన్ని అందుకోవడంతో, కొందరు మీడియా వారు బండ్ల గణేష్ ఇంటికి వెళ్లి, ఇప్పుడు మీరు గొంతు కోసుకుంటారా అని ప్రశ్నించడం జరిగింది.
అయితే ఆవేశంలో మనం బోలెడు మాటలు అంటాం, కానీ అవన్నీ చేయలేము కదా అంటూ సున్నితంగా ఆయన తప్పించుకోవడం జరిగింది. దానితో పూర్తిగా రాజకీయాలకు స్వస్తి చెప్పిన బండ్ల గణేష్, ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి ల కలయికలో రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా మళ్ళి కమెడియన్ గా రిఎంట్రీ ఇస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎంతో ఫన్నీగా అద్భుతంగా ఉంటుందని, ఇక ఆయన క్యారెక్టర్ పేరు బ్లేడ్ గణేష్ అని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. అంతేకాక ఈ క్యారెక్టర్ తనకు తప్పకుండా కమెడియన్ గా మంచి బ్రేక్ ని ఇస్తుందని గణేష్ భావిస్తున్నారట. మరి రాబోయే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సరిలేరు నీకెవ్వరు మూవీలో బండ్ల ఏ రేంజ్ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి