మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడ్డ ‘సైరా’ విడుదల కోసం మెగా అభిమానులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగుప్రజలు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబరు 2న విడుదల కాబోతున్న ఈ మూవీ పై ఇండస్ట్రీ వర్గాలలో భారీ అంచనాలు ఉన్నాయి.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సొంత గ్రామం కర్నూల్ జిల్లలో ఉన్న నేపధ్యంలో ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ను కర్నూల్ లో ఈనెల మూడవ వారంలో అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నారు. దాదాపు లక్షమంది మెగా అభిమానులు ఈ వేడుకకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఉయ్యాలవాడకు సంబంధించి ఒక మీడియా సంస్థ బయటపెట్టిన కధనంలో ఆయన గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
తొలి స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రచారం పొందుతున్న ఉయ్యాలవాడ మొదట్లో దేశభక్తుడు కాడట. ఒక సంస్థానానికి పాలెగాడుగా ఉండే ఉయ్యాలవాడ మొదట్లో బ్రిటీషు వారికి తొత్తుగానే ఉంటూ బ్రిటీష్ వారిపై తన విధేయతని ప్రదర్శిస్తుండేవాడట. అయితే ఒకానొక సందర్భంలో అప్పట్లో కొత్తగా వచ్చిన బ్రిటీష్ కలెక్టర్‌కీ ఉయ్యాల వాడకు మధ్య చిన్నగొడవ రావడంతో ఆ గొడవ పంతంగా మారి తాను బ్రిటీష్ వారికి పన్ను కట్టవలసిన అవసరం లేదనీ తిరుగుబాటు చేసే స్థాయికి తీసుకు వెళ్ళింది అన్న విషయాలు ఆ కథనంలో పేర్కొనబడింది.
అంతేకాదు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్త్రీలోలుడని అతడికి చాలామంది భార్యలు ఉన్నారు అన్న ప్రచారం కూడ ఉంది. అయితే ఇలాంటి నెగిటివ్ విషయాలను ఉయ్యాలవాడ పాత్ర స్థాయి తగ్గకుండా ‘సైరా’ ఎంత వరకు చూపించారు అన్న విషయమై సందేహాలు ఉన్నాయి. వాస్తవానికి ఉయ్యాలవాడ జీవించింది 18వ శతాబ్దం కాబట్టి అతడి జీవితానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఏమీలేవు. కేవలం కర్నూలు ప్రాంతంలో ప్రచారంలో ఉన్న ఒగ్గు కథలను ఆధారంగా చేసుకుని ఈ మూవీకి కథ అల్లారు..