ఈరోజుతో బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞకు 25 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సదర్భాన్ని పురస్కరించుకుని కృష్ణ గుంటూర్ జిల్లాలలో బాలయ్య అభిమానులు మోక్షజ్ఞ పుట్టినరోజును చాల ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన వార్తలను అనేక ప్రముఖ చానల్స్ చాల ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయి. 

ఈ హడావిడి అంతా చూసి ఈరోజు మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ గురించి ఏదైనా ప్రకటన వస్తుందేమో అని బాలయ్య అబిమానులు ఆశించారు. అయితే అలాంటి విషయాలు ఏమి లేవు కేవలం మోక్షజ్ఞ పాత ఫోటోలను తిరిగి సోషల్ మీడియా ద్వారా మళ్ళీ విడుదల చేసారు. కనీసం ఆ ఫోటోలలో మోక్షజ్ఞకు సంబంధించిన ఒక్క ఫోటో కూడ లేకపోవడంతో అసలు ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారు అన్న విషయం ఎవరికీ అంతుపట్టని ప్రశ్నగా మారింది. 

మోక్షజ్ఞ కు సినిమాల పట్ల ఆసక్తి లేదు అతడి బాడీ కూడ ప్రస్తుతం ఫిట్ గా లేదు అన్న వార్తలు గత కొంత కాలంగా వస్తూనే ఉన్నాయి. ఈ వార్తలను బాలకృష్ణ ఎప్పుడూ ఖండించక పోవడంతో ఈ విషయాలు అన్నీ నిజమేనా అన్న సందేహాలు కూడ బాలయ్య అభిమానులలో కలుగుతున్నాయి. 

దీనికితోడు మోక్షజ్ఞ ఎక్కడా కనిపించకపోవడంతో పాటు అతడికి సంబంధించిన విషయాలు అన్ని అత్యంత రహస్యంగా ఇప్పటికీ ఉంచడం చాలమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనితో 25 సంవత్సరాలు నిండిపోయిన కొడుకుని బాలయ్య ఎందుకు ఇంత రహస్యంగా దాస్తున్నాడు అంటూ చాలామంది ఆశ్చర్యపోతూ అజ్ఞాతంలో ఉన్న వ్యక్తికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈమధ్య బాలయ్యతో కలిసి మోక్షజ్ఞ తూర్పుగోదావరి జిల్లాలోని ఒక ఆలయంలో రహస్యంగా పూజలు చేసుకున్న నేపధ్యంలో ఈ పూజలు దేనికోసం అంటూ మరికొందరు షాక్ అవుతున్నారు..    


మరింత సమాచారం తెలుసుకోండి: