నిన్న ప్రారంభం అయిన చిరంజీవి కొరటాల మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రకటింపబడ్డ టెక్నీషియన్స్ పేర్లలో దేవిశ్రీ ప్రసాద్ కు చోటు దక్కక పోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన నాలుగు సినిమాలకు దేవిశ్రీ మంచి ట్యూన్స్ ఇచ్చాడు. ఆ మూవీల ఘన విజయంలో దేవిశ్రీ ప్రసాద్ పాత్ర చాల ఉంది. 

అయితే ఇంత సాన్నిహిత్యం ఉన్న దేవీశ్రీని కొరటాల తొలగించడం వెనుక చిరంజీవి ఒత్తిడి ఉందా అన్న మాటలు వినిపిస్తున్నాయి. గతంలో మెగా కాంపౌండ్ తో ఎంతో సన్నిహితంగా ఉండే దేవిశ్రీని ఇప్పుడు మెగా హీరోలు అంతా పక్కకు పెడుతున్నారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మూవీలో దేవిశ్రీని పక్కకు పెట్టారు. 

ఇప్పుడు లేటెస్ట్ గా చిరంజీవి సినిమాలో కూడ అతడికి స్థానం దక్కక పోవడం పెద్ద షాక్ అని అంటున్నారు. ఈమధ్య కాలంలో మంచి పాటలకు ట్యూన్స్ ఇవ్వక పోవడం ఒక అయితే ఇలాంటి సమయంలో దేవిశ్రీని మెగా కాంపౌండ్ మధ్యలో వదిలివేయడం షాకింగ్ అన్న కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఈ న్యూస్ మెగా అభిమానుల వరకు వెళ్ళడంతో ఇప్పుడు వారంతా షాక్ లో ఉన్నట్లు టాక్. 

‘సైరా’ అనుకున్న స్థాయిలో రికార్డులు క్రియేట్ చేయలేకపోవడానికి గల కారణాలలో ఆ మూవీలోని పాటలు ట్యూన్స్ బాగా లేవు అన్న అభిప్రాయం మెగా అభిమానులలో ఉంది. దీనితో ‘ఇస్మార్ట్ శంకర్’ ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చిన మణిశర్మకు కానీ లేదంటే తమన్ కు కానీ అవకాశం ఇస్తే బాగుంటుందని వీరెవ్వరు కాకుండా మరో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే మరొకసారి ‘సైరా’ ప్రయోగమే అవుతుందని అభిప్రాయ పడుతూ ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మళ్ళీ ఆలోచనలు చేయమని మెగా అభిమానులు వందల సంఖ్యలో కొరటాల మెసేజ్ లు పెడుతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: