‘వెంకీ మామ’ పూర్తి కావడంతో తరుణ్ భాస్కర్ దర్శకత్వంతో వెంకటేష్ నటించబోయే లేటెస్ట్ మూవీ షూటింగ్ కు కౌంట్ దౌన్ మొదలైంది. ఈమూవీ కథ అంతా గుర్రపు పందాలు చుట్టూ తిరుగుతుంది. ఈమూవీలో వెంకటేష్ జాకీగా నటిస్తున్నాడు. ఈ మూవీ కథ రీత్యా వెంకటేష్ అనేకసార్లు గుర్రపు పందాలలో పాల్గొంటూ చాల వేగంగా గుర్రాలు నడపవలసిన అవసరం ఉంది. 

ఇలాంటి పరిస్థితులలో వెంకటేష్ గుర్రపు స్వారీని మరొకసారి నేర్చుకుంటూ చాల వేగంగా గుర్రాలను నడపడానికి ప్రస్తుతం ఒక ట్రైనర్ ను పెట్టుకుని శిక్షణ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మధ్య ‘వెంకీ మామ’ షూటింగ్ సమయంలో వెంకటేష్ మోకాలికి గాయం అయిన నేపధ్యంలో ఆ గాయం తగ్గినప్పటికీ వెంకటేష్ మోచిప్ప దగ్గర ఇంకా నొప్పి వస్తున్నట్లు టాక్. 

దీనితో డాక్టర్లు వెంకటేష్ ను కనీసం ఆరు నెలలు పాటు రిస్కీ ఫైట్స్ చేయవద్దని సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో వెంకటేష్ తన మోకాలు నొప్పిని లెక్క చేయకుండా తరుణ్ భాస్కర్ సినిమా కోసం అప్పుడే గుర్రపు స్వారీలు మొదలుపెట్టి రిస్కీ ఫైట్స్ చేయడం వెంకటేష్ కుటుంబ సభ్యులకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. దీనితో కంగనా రనౌత్ ‘మణికర్ణిక’ సినిమా విషయంలో చేసిన గుర్రపు స్వారీలకు విజువల్ ఎఫెక్ట్స్ ఇచ్చిన విధంగా వెంకటేష్ పాత్రకు కూడ చేయమని దర్శకుడు తరుణ్ భాస్కర్ కు సురేశ్ బాబు సలహాలు ఇస్తున్నట్లు టాక్. 

అయితే తనకన్నా వయసులో పెద్ద వాడైన చిరంజీవి ‘సైరా’ సినిమా కోసం రిస్కీ ఫైట్స్ చేసినప్పుడు తాను ఎందుకు చేయలేను అంటూ వెంకీ సాహసాలు చేయడానికే మొగ్గు చూపుతున్నట్లు టాక్. దీనితో సినిమాల పోటీ విషయంలో వయస్సు పెరిగినప్పటికీ సీనియర్ హీరోలు యంగ్ హీరోలతో సమానంగా ఎలా పోటీ పడుతున్నారో  అర్ధం అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: