నటుడిగా సమర్ధత ఎంత ఉన్నా సరైన హిట్స్ లేకుంటే ఆ సినిమా హీరో కెరియర్ కు టర్నింగ్ పాయింట్ రాదు. ఈ కోవలోనే ప్రస్తుతం యంగ్ హీరో సందీప్ కిషన్ కెరియర్ ప్రశ్నార్ధకంగా మారింది అని వార్తలు వస్తున్నాయి. సందీప్ కిషన్ తన కెరియర్ లో నటించిన సినిమాలకు మంచి పేరు వచ్చినా ఏ ఒక్క సినిమా అతడికి కమర్షియల్ గా సక్సస్ ను ఇవ్వలేదు.  ఈ పరిస్థుతులలో ఈ శుక్రు వారం విడుదల కాబోతున్న ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా పై అతడి కెరియర్ ఆధారపడి ఉంటుంది అనే వార్తలు వస్తున్నాయి. పేరుకు చిన్న సినిమా అయినా ఈ సినిమాను ప్రస్తుతం పెద్ద సినిమాల పోటీ ఏది లేకపోవడంతో ఈ సినిమాను భారీ స్థాయిలోనే విడుదల చేస్తున్నారు. రోమాoటిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈసినిమా షారుక్ ఖాన్ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సూపర్ హిట్ అయింది కాబట్టి అదే ఎక్స్ ప్రెస్ సెంటిమెంట్ ను నమ్ముకుని విడుదల కాబోతోంది. ప్రస్తుతం సందీప్ కిషన్ కెరియర్ డల్ గా ఉండడంతో ఈ సినిమాను మార్కెట్ చేయడానికి ఈ సినిమా నిర్మాతలు చాల కష్ట పడ్డారని టాక్.  ఈసినిమా విజయం పైనే నాని నిర్మాతగా మారి నిర్మిస్తున్న ‘డీ ఫర్ దోపిడీ’ సినిమా మార్కెట్ కూడా ఆధారపడి ఉంది అని అంటున్నారు. దీనికి కారణం ఆ సినిమాలో కూడా సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి నటుడిగా పేరున్న ఈ యంగ్ హీరోకు సందీప్ కిషన్ ఎక్కబోతున్న ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ అతడి కెరియర్ ను ఎటు వైపుకు తీసుకు వెళుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: