ఓ సాధారణ యాంకర్‌గా మొదలైన
బిత్తిరి సత్తి ప్రయాణం ఇప్పుడు చాలా దూరం వెళ్లిపోయింది. తెలంగాణ యాసలో అతను చేసే కామెడీ ఒకరకంగా నవ్వు తెప్పించినా....సామజిక విషయాలపై ఆలోచన కలిగించేలా ఉంటాయి అతని మాటలు. తుపాకి రాముడు అంటూ సినిమా చేసిన సత్తి ఉరఫ్
రవి కుమార్ ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో
బిత్తిరి సత్తి తాను సినిమా ఇండస్ట్రీలో పడిన కష్టాలను పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు.
కమెడియన్ కమ్ యాంకర్ గా బుల్లి తెర అభిమానులను అలరించిన
బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్, ఇప్పుడిప్పుడే తన గత జీవితంలో జరిగిన సంఘటనలను బయటపెడుతున్నాడు.తనకు లైఫ్ ఇచ్చిన ఛానెల్ నుంచి బయటికి రావటం గురించి ప్రశ్నించగా టీవీ వాళ్ళకి టీఆర్పీలు ఇవ్వాలి కానీ నాకు డబ్బులు వద్దా అంటున్నాడు. ఈ సందర్భంగా
బిత్తిరి సత్తి పాత్ర ద్వారా తనకు వచ్చిన ఫేమ్‌తో డబ్బు సంపాదించుకోవడం తప్పుకాదని
రవి కుమార్ కుండబద్దలు కొట్టాడు.
ఛానెల్ మారిన తర్వాత ఒకప్పుడు ఉన్న ఇమేజ్ ఇప్పుడు లేదు కదా నిజంగా చెప్పు సత్తి అంటే అయ్యుండొచ్చు కానీ నా టాలెంట్ నాకు ఉంది అంటూ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అలాగే తన వద్ద స్టైలిష్
అల్లు అర్జున్ ఓ విషయంలో ట్రైనింగ్ తీసుకున్నట్లు బాంబు పేల్చాడు.
రుద్రమ దేవీ సినిమాలో గోనగన్నారెడ్డి పాత్ర వేసిన అల్లు అర్జున్‌కు తెలంగాణ యాస నేర్చుకోవడం తప్పనిసరి అయ్యింది.
దీంతో ఆ యాసలో పట్టుకోసం తనను
అల్లు అర్జున్ ఫోన్ చేసి మరీ సంప్రదించినట్లు సత్తి చెప్పుకొచ్చాడు. అలాగే
అల్లు అర్జున్ చాలా మంచి వ్యక్తి అని తన స్టార్ డమ్ నిలబెట్టుకోవడం కోసం అతడు పడే శ్రమ మామూలు విషయం కాదని అన్నాడు.