ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మరింత పీక్స్ లోకి వెళ్లాయి. ప్రస్తుతం మేనిఫెస్టో గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదే తరుణంలో సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు, నవరత్నాల పేరుతో  జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు.ఈ తరుణంలో జగన్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో పాత పథకాలు కాస్త ఇంక్రీజ్ చేసి ఇవ్వడం తప్ప కొత్తగా వచ్చింది ఏమీ లేదని కొంతమంది భావిస్తున్నారు. కానీ జగన్ మాత్రం బడ్జెట్ కు తగ్గట్టుగా  పథకాలు పొందుతున్న వారిని ఎవరిని కూడా తీసివేయకుండా వారందరికీ కాస్త పెంచి ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నారు. అధిక హామీలు ఇచ్చి  నెరవేర్చకుంటే ప్రజలు నమ్మరని జగన్ నమ్మకం. 

కానీ చంద్రబాబు  సూపర్ సిక్స్ పేరుతో అనేక హామీలు ఇచ్చారు. 2014లో ఇచ్చిన హామీల్లో పెన్షన్ తప్ప ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అనే అపోహ ప్రజల్లో ఉన్నది.  అలాంటప్పుడు ఈసారి ఆయనను ఎవరు నమ్ముతారు సాధ్యం కానీ హామీలతో గద్దెనెక్కాలని చూస్తున్నారు చంద్రబాబు అని  జగన్ ప్రజలకు అర్థమయ్యే  విధంగా వ్యూహాలు పన్నుతున్నారు. 2014 టైం లో చంద్రబాబు  మేనిఫెస్టోలో డ్వాక్రా రుణమాఫీ, అలాగే తాకట్టు పెట్టబడిన బంగారు నగలు కూడా విడిపిస్తానని, రైతుల రుణమాఫీ సంపూర్ణంగా చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే చేనేత కార్మిక రుణమాఫీ, అంతేకాకుండా బిడ్డ పుట్టిన వెంటనే 25 వేల రూపాయలు ఇలా ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు 2019 చివరి వరకు ఒక పెన్షన్ తప్ప మరేమీ చేయలేదు.

రుణమాఫీ అనేది మూడేళ్ల తర్వాత ఏదో తూతూ మంత్రంగా చేసేసారు. అదే 2019లో జగన్ ఇచ్చిన హామీలను 90% పూర్తి చేశారని ఆయనకు నమ్మకం ఉంది. అందుకే ఆయన కొత్త పథకాలు పెట్టి అమలు చేయకపోవడం కంటే పాత పథకాలే కాస్త పెంచేసి అమలు చేయడం మంచిదని ఆలోచనలో ఉన్నారు. 2014 ప్రధాన అస్త్రంగా తీసుకున్న జగన్  చంద్రబాబు మేనిఫెస్టోలో ఉన్న హామీలను ప్రజలు నమ్మరని, 2014లో ఇలాగే చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేశారనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ విధంగా చంద్రబాబును నమ్మరనే నమ్మకంతోనే జగన్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: