యంగ్ హీరో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త బంగారు లోకం తో తెలుగు తెరకు పరిచయమైంది శ్వేత. మొదటి విజయం సాధించడంతో ఈ అమ్మాడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అలాగే అప్పట్లో స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కానీ ఫస్ట్ హిట్ తర్వాత సరైన లు ఎంచుకోవడంలో విఫలమయ్యింది. దీంతో ఈ బ్యూటీ ఖాతాలో వరుస డిజాస్టర్స్ వచ్చి చేరాయి. శ్వేత నటించిన ఏ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో మెల్లగా ఈ బ్యూటీ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది.పలు చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసిన శ్వేత.. ఆ తర్వాత కొన్ని ల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. అయినా ఆశించిన స్థాయిలో ఈ బ్యూటీకి గుర్తింపు రాలేదు. దీంతో అటు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. చాలా కాలంగా లకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఓటీటీలో పలు వెబ్ సిరీస్ చేస్తూ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగే అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈబ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లకు షాకిస్తున్నాయి. ఒకప్పుడు ట్రెడిషనల్ లుక్స్ లో ఎంతో క్యూట్ గా కనిపించిన ఇప్పుడు గ్లామర్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. అప్పట్లో బొద్దుగా ఉన్న ఆ అమ్మడు.. ఇప్పుడు జీరో సైజ్ లోకి మారిపోయింది.

హీరోయిన్ గా వెండితెరపై ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన శ్వేతకు వ్యక్తిగత జీవితంలోనూ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. 2018లో తన ప్రియుడు రోహిత్ మిట్టల్ ను పెళ్లిచేసుకుంది. కానీ మనస్పర్థలతో వీరిద్దరు విడిపోయారు. ప్రస్తుతం సింగిల్ గా లైఫ్ ను లీడ్ చేస్తున్న శ్వేతా బసు ప్రసాద్ ఇప్పుడు ఓటిటి లో కొన్ని వెబ్ సిరీస్ లను చేస్తూ తన లైఫ్ మళ్లీ బిజీగా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక అందులో భాగంగానే సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. తనకు తగ్గ మంచి పాత్ర దొరికితే సినిమాల్లో కూడా రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది.ఇక చాలా రోజులుగా వెండితెరకే కాదు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్న ఈ బ్యూటీ, తాజాగా తన హాట్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ ఈబ్యూటీ షేర్ చేసిన లేటేస్ట్ ఫోటోస్ అందరిని షాక్‌కు గురి చేస్తున్నాయి. బొద్దుగా ఉన్న బ్యూటీ..చాలా సన్నగా.. వయ్యారాలు ఒలుకబోస్తూ చాలా గ్లామర్‌గా ఉంది.విడాకుల తర్వాత శ్వేత ఒంటరిగానే ఉంటుంది. ఇప్పుడు తన గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: