టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఇటీవల నటించిన సాహో సినిమాతో కొంత నిరాశ చెందారనే అనాలి. బాహుబలి రెండు భాగాల అద్బుత విజయాల తరువాత ప్రభాస్ నటించిన అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా విపరీతమైన అంచనాల మద్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో సినిమా, ఆ అంచనాలు అందుకోవడంలో మాత్రం చాలావరకు విఫలం అయినట్లే చెప్పాలి. అత్యంత భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన ఈ సినిమా కథ మరియు కథనాలను ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా తీయడంలో దర్శకుడు సుజీత్ చాలా వరకు ఫెయిల్ అయినట్లు మెజారిటీ ప్రేక్షకులు తేల్చడం జరిగింధి. అయితే బహుబలీ రెండు భాగాల సినిమాల సూపర్ సక్సెస్ తరువాత ప్రభాస్ కు నార్త్ లో కూడా మంచి క్రేజ్ రావడం జరిగింధీ, ఇక ఆ క్రేజ్ తో సాహో సినిమా నార్త్ లో మాత్రం బాగానే కలెక్షన్స్ రాబట్టడం జరిగింది. ఇక ప్రస్తుతం జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న ప్రభాస్, ఎలాగైనా ఈ సారి సూపర్ డూపర్ హిట్ కొట్టి తన ఫ్యాన్స్ ను సంతోషపెట్టాలని చూస్తున్నారు.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కొన్నేళ్ళ క్రితం యూరోప్ లో జరిగిన ఒక రేట్రో ప్రేమకథగా అన్ని రకాల కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినపడుతోంది. ఇక ఈ విషయాలు అటుంచితే, బాహుబలి సినిమాల రిలీజ్ తరువాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని ఆయన ఫ్యాన్స్ భావించారు, అయితే అది జరుగలేదు. అంతేకాదు, దాని తరువాత ఆయన సాహోలో నటించడం, అది కూడా రిలీజ్ అవడం జరిగింధి. అయినప్పటికీ ఆయన పెళ్లి మాత్రం చేసుకోకపోవడంతో ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింధి. ఇక కొన్నాళ్ళ నుండి ప్రభాస్ మరియు అనుష్క మద్య రహస్య ప్రేమయాణం సాగుతోందని, అతి త్వరలో వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ పలు వార్తలు షికారు చేశాయి. అయితే అవన్నీ ఒట్టి పుకార్లేనని వారిద్దరూ గట్టిగా కొట్టిపారేయడం జరిగింధి. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న ప్రకారం, ప్రభాస్ పెళ్లి అతి త్వరలో జరిగే అవకాశం గట్టిగా కనపడుతోందట.

అయితే అమ్మాయి మాత్రం సినిమా ఇండస్ట్రీకి చెందినది కాదని అంటున్నారు. ఇకపోతే తన పెళ్లి విషయామై ప్రభాస్ ఒక సంచలన నిర్ణయం కూడా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన పెళ్లిని మాత్రం హంగు మరియు ఆర్భాటం లేకుండా చాలా సాదాసీదాగా చేసుకోవాలనేది ప్రభాస్ ఉద్దేశ్యమట. అయితే ఈ విషయమై ప్రభాస్ కుటుంబసభ్యులు కూడా ఒప్పుకున్నట్లు చెప్తున్నారు. మరి ఎప్పుడెప్పుడు తమ హీరో పెళ్లి అవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆయన ఎంతో నార్మల్ గా పెళ్లి చేసుకోకోవాలని నిర్ణయించారు అనేది కొంత ఇబ్బందికరమైన విషయమే అయినప్పటికీ, అతి త్వరలో ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు అనేది మాత్రం పండుగ వార్తే అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంధి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: