సుడిగాలి సుధీర్ ఏంటి.. పవన్ కల్యాణ్, రజినీకాంత్ లతో ఆడుకోవడం ఏంటి అనుకుంటున్నారా.. అవును మరి. ఇప్పుడు సుడిగాలి సుధీర్ కూడా హీరో అయ్యాడు కదా.. జబర్దస్త్ టెలివిజన్ షోతో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న సుధీర్ ఇప్పుడు సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


ఇప్పుడు ఆ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. అందుకే ఆ సినిమాను క్రమంగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఈ మూవీ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిజీవుతుందట. ఈ సినిమా వివరాలను ఇటీవల సుడిగాలి సుధీర్ మీడియాతో పంచుకున్నాడు. ఈ సినిమాలో సుడిగాలి సుధీర్... పవన్ కల్యాణ్, రజనీకాంత్‌ను ఇమిటేట్ చేశాడట. నిర్మాత, దర్శకులు సుధీర్ తో పట్టుబట్టి అలా చేయించారట. ఇంకేముంది సుధీర్ వారి ఇద్దరి స్టయిల్ తో ఓ ఆట ఆడుకున్నాడట. మరి అది సినిమాలో ఎంత వరకూ వర్కవుట్ అయ్యింది మూవీ రిలీజైతే కానీ తెలియదు. అయితే తాను నిజజీవితంలోపవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ రజనీకాంత్ లను పిచ్చిగా అభిమానిస్తాడట.


సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాలో నేను పవన్ కల్యాణ్ అభిమానిగా నటించాడట. అందుకే ఇమిటేట్ చేయడం సులభమైందట. తాను అలా ఇమిటేట్ చేయడం నాకు భయమేసిందంటున్నాడు సుడిగాలి సుధీర్. ఆ తర్వాత ధైర్యం తెచ్చుకొని ఇమిటేట్ చేశాడట. ఇది అందరికీ బాగా నచ్చుతుంది అని సుడిగాలి సుధీర్ అన్నారు.


తాను ఎప్పటికీ హీరో అని ఫీల్ కానంటున్నాడు సుడిగాలి సుధీర్. ఈ సినిమాకు కథే హీరోనట. ఈ మూవీలో ఎవర్ని పెట్టినా బాగా ఆడుతుంది. మంచి కథతో తెరకెక్కింది. ఫీల్‌గుడ్ హాస్యంతో అందర్ని నవ్వించేలా ఉంటుంది. నేను హీరోగా నటించినా.. నేను చచ్చిపోయేంత వరకు నవ్విస్తూనే ఉంటాను అంటున్నాడు సుడిగాలి సుధీర్.. ఈ సినిమాను డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని అనుకొంటున్నామంటున్న సుధీర్.. తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: