‘బిగ్ బాస్ 3’ విజేత ఎవరు అన్నది తేలిపోయి ఐదు రోజులు దాటిపోతున్నా శ్రీముఖి ఎవరికీ అందుబాటులో ఉండకపోవడం అందరికీ షాక్ ఇస్తోంది. వరుణ్ సందేశ్ ఇంటిలో జరిగిన డిన్నర్ కు రమ్మని శ్రీముఖికి ఫోన్ చేయాలని ప్రయత్నించినా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండటంతో వరుణ్ శ్రీముఖి తమ్ముడుకి ఫోన్ చేసి శ్రీముఖిని ఆ పార్టీకి రప్పించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీముఖి స్పందించలేదు అని తెలుస్తోంది. 

అంతేకాదు శ్రీముఖితో ఇంటర్వ్యూ చేయాలని అనేక న్యూస్ ఛానల్స్ ప్రయత్నించినా ఆమె అందుబాటులోకి రాకపోవడంతో కొన్ని న్యూస్ ఛానల్స్ న్యూస్ ఎడిటర్స్ శ్రీముఖి తీరుకు అసహనానికి గురైనట్లు టాక్. ఒక షోలో ఓడిపోయినంత మాత్రాన ఆ ఓటమిని అంత సీరియస్ గా తీసుకోవడం ఏమిటి అంటూ కొందరు కామెంట్స్ కూడ చేస్తున్నారు. 

ఇది ఇలా ఉండగా తెలుస్తున్న సమాచారం మేరకు శ్రీముఖి ప్రస్తుతం మాల్దీవులలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘బిగ్ బాస్’ షో నుండి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత శ్రీముఖి తన తల్లి తమ్ముడు కొంతమంది సన్నిహితులతో కలిసి మాల్దీవులు వెళ్లిందని ఆమె అక్కడ ఒక వారంరోజుల పాటు ఎంజాయ్ చేయబోతున్నట్లు సమాచారం. 

ప్రస్తుతం శ్రీముఖి తన మాల్దీవుల ట్రిప్ నుండి బయటకు వచ్చిన తరువాత మాత్రమే తన సెల్ ను అందరికీ అందుబాటులోకి తీసుకు వస్తుందని అప్పటి వరకు ఇదే మౌనాన్ని కొనసాగిస్తుందని అంటున్నారు. శ్రీముఖి ఒప్పుకున్న ఏ షోలు ప్రస్తుతం షూటింగ్ దశలో లేని నేపధ్యంలో ఆమె మళ్ళీ బుల్లితెర పై కనిపించాలి అంటే కనీసం రెండు నెలలు పట్టినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. దీనికితోడు తన ఓటమిని హుందాగా కాకుండా ఒక పగ గా స్వీకరించిన శ్రీముఖి వ్యక్తిత్వం పై అనేకమంది సెటైర్లు వేయడం ఇంకా కొనసాగుతూనే ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: