విక్టరీ వెంకటేష్ తరుణ్ భాస్కర్  కాంబినేషన్ లో హార్స్ రేసింగ్  సబ్జక్ట్ పై మూవీ వస్తుంది అని అనుకుంటున్న సందర్భంలో వెంకయ్అదృష్టి ‘అసురన్’ రీమేక్ పై పడింది.   ధనుష్ నటించిన ‘అసురన్’ చూసి ఏరికోరి ఆ మూవీ రీమేక్ హక్కులను వెంకటేష్ తన అన్న సురేశ్ బాబు ద్వారా కొనిపించాడు.  

‘అసురన్’ మంచి సినిమా అయినప్పటికీ ఈ సినిమాకు డైరెక్టర్ ను ఫైనల్ చెయ్యడం వెంకటేష్ కు సమస్యగా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. అవార్డు విన్నింగ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వెట్రి మారన్ చేత ఈ మూవీని రీమేక్ చేయాలని వెంకటేష్ భావించినా ఆ ప్రయత్నాలకు వెట్రి మారన్ నో చెప్పినట్లు తెలుస్తోంది.   

దీనికారణం భాష ఇబ్బంది అని అంటున్నారు. వెట్రి మారన్ కు తమిళం తప్ప తెలుగు  అసలు రాదు. అందువల్ల తనకు తెలియని భాషలో సినిమాను చేయడం తనవల్ల కాదు అంటూ ఈ దర్శకుడు చేతులు ఎత్తేసినట్లు వార్తలువస్తున్నాయి. దీనితో ఇటీవల రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో ఒక 20 మంది యువ దర్శకులకి ఈ మూవీ షోను వెంకటేష్ చూపించాడు అని వార్తలు వస్తున్నాయి. 

సినిమా చూసి యాజిటీజ్ గా రీమేక్ చెయ్యగలమని ఎవరు ముందుకు వస్తే వారికి బాధ్యత అప్పగించాలని వెంకటేష్ ప్లాన్ అని అంటున్నారు. అయితే ఈ మూవీ చూసిన తరువాత దర్శకుడు వెట్రి మారన్ తీసిన స్థాయిలో పవర్ ఫుల్ గా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయడం కష్టం అని చాలామంది యంగ్ డైరెక్టర్లు చేతులు ఎత్తేసినట్లు సమాచారం. అయితే దర్శకుడు ఓంకార్ ముందుకు వస్తున్నా అతడిని నమ్మలేని స్థితిలో వెంకటేష్ ఉన్నాడని అంటున్నారు. దీనితో నచ్చిన సినిమాను రీమేక్ చేయలేక ప్రస్తుతం వెంకీ తెగ బాధ పడిపోతున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: