2013వ సంవత్సరంలో బాలకృష్ణ ఒక అరుదైన రికార్డును సాధించాడు. గత 30 ఏళ్లల్లో ఏడాది పాటు బాలకృష్ణ తెలుగు సినిమా ప్రేక్షకులను పలకరించకపోవడం ఇదే ప్రథమం. ఇంత గ్యాప్ తీసుకొని మరీ బాలయ్య ఓ సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమాపై చాలా అంచనాలుంటాయి. ఆందుకే బాల కృష్ణ ఆచి తూచి ‘లెజెండ్’ సినిమాకు కమిట్ అయ్యాడు.  బాలయ్యతో ‘సింహా’ లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకుడవ్వడం, ‘దూకుడు’ లాంటి హిట్ తర్వాత నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండట ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి . ఇందులో బాలయ్య పాత్రలో రెండు రకాల కోణాలుంటాయని, అత్యంత శక్తిమంతంగా ఆయన పాత్ర ఇందులో ఉంటుందని అంటున్నారు. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 6 వరకూ వైజాగ్‌లో ఈ చిత్రానికి సంబంధించి భారీ షెడ్యూల్ చేశారు.  ఈ నెల 12 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ మొదలు కానుంది. జనవరి 14 వరకూ జరిగే ఈ షెడ్యూల్‌లో ఓ పాటను, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇదిలావుంటే. ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను బాలయ్యకు గతంలో కలిసి వచ్చిన ముద్దుల మామయ్య విడుదల సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని రాబోతున్న కొత్త సంవత్సరం ఫేబ్రవరిలో విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏమైనా బాలయ్య కు 30 ఏళ్ళ రికార్డు ను క్రిఏట్ చేసిన సంవత్సరం గా 2013 మిగిలిపోనుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: