ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఇటీవల రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాలు అత్యద్భుత విజయాలు అందుకోవడంతో ఈ సినిమాపై టాలీవుడ్ సహా పలు సినిమా ఇండస్ట్రీల ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అధికారిక లుక్స్ బయటకు రాకపోవడంతో ప్రేక్షకులు ఎంతో నిరాశ చెందారు. 

 

కాగా ఎప్పటినుండో వారు చూస్తున్న ఎదురుచూపులకు తెర దించుతూ నేడు ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్, ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రక్కన నటించబోయే హాలీవుడ్ నటి 'ఒలీవియా మోరిస్', మెయిన్ విలన్ 'రే స్టీవెన్సన్', మరియు లేడీ విలన్ అయిన 'ఆలిసన్ డూడి' ల ఫస్ట్ లుక్ పోస్టర్లను తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో కాసేపటి క్రితం రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం వీరి ఫోటోలు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తున్న ఈ సినిమాలో మరొక బాలీవూడ్ నటుడు అజయ్ దేవగన్ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుండగా, కోలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరుగాంచిన సముద్రఖని

 

మరియు టాలీవుడ్ లో ఇటీవల కమెడియన్ గా మంచి పేరు సంపాదించిన రాహుల్ రామకృష్ణ మరొక పాత్రలో నటిస్తున్నాడు. ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాకు వి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా, కేకే సెంథిల్ కుమార్ కెమెరామ్యాన్ గా వర్క్ చేస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ సినిమాను దాదాపుగా రూ.450  రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ ని జరుపుకున్న ఈ సినిమాను 2020 జులై 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవెల్లో రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: