ఆమె ఓ హీరోయిన్.. ఇప్పుడు ఓ బెదిరింపు కేసులో పోలీసులకు చిక్కింది. ఓ వీడియో బయటపెడతానంటూ ఆమె ఒకరిని బెదిరించి దాదాపు 15 లక్షలు వసూలు చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు దొరికిపోయింది. వివరాల్లోకి వెళ్తే..

ప్రముఖ మరాఠీ నటి సారా శ్రవణ్ తన నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది.

 

సారా శ్రవణ్ సుభాష్ యాదవ్ అనే నటునితో ఒక సినిమాలో యాక్ట్ చేసింది. సినిమా విడుదలైన తరువాత ఆమె సుభాష్ యాదవ్ తనను వేధించాడని పోలీసులకు కంప్లయింట్ చేసింది. అయితే ఈ కేసును ప్రైవేటుగా సెటిల్ చేసుకుందామని సుభాష్ యాదవ్ భావించారు. అందుకే ఓ మధ్యవర్తి సాయంతో రాజీకి వచ్చారు. తనది తప్పయిందని ఒప్పుకున్నాడు.

 

అయితే ఈ క్షమాపణ ప్రక్రియనంతా... మధ్యవర్తిగా ఉన్న రామ్ జగదాలే వీడియో తీశాడు.. ఇప్పుడు అతడు ఆ వీడియోను మీడియాకు ఇస్తానంటూ యాదవ్ ను బెదిరించడం ప్రారంభించాడు. అసలే ఈ కేసు కారణంగా తన పరువు పోయిందని భావిస్తున్న సుభాష్ యాదవ్.. ఈ బెదిరింపులతో మరింత కుదేలయ్యాడు.

 

ఏం చేయాలో పాలుపోక.. చివరకు అతను పోలీసులను ఆశ్రయించారు. ఇంకే ముంది.. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసలుు సదరు రామ్ జగదాలేను అదుపులోకి తీసుకుని విచారించారు. తాను సారా శ్రావణ్ సూచనల మేరకే ఈ క్షమాపణలను వీడియో తీశానని అతను పోలీసులకు మొరపెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ వ్యవహారంలో సారా శ్రావణ్ ఇరుక్కుపోయింది. తానే సుభాష్ యాదవ్ పై కంప్లయింట్ చేస్తే.. చివరకు ఈ వీడియో వ్యవహారం కారణంగా ఆమె ఇప్పుడు నిందితురాలిగా మారే పరిస్థితి వచ్చింది. మరి చివరకు ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందో..?

అసలే హీరోయిన్..అందులోనూ ముంబై పోలీసులు.. పాపం.. అమ్మడు ఇలా చిక్కుకుపోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: