నందమూరి బాలకృష్ణ 105వ సినిమా కం ఎన్నో అంచనాల మధ్య రూలర్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూలర్  సినిమాలో బాలకృష్ణ గెటప్ సరికొత్తగా కనిపించడంతో రూలర్ సినిమా విషయంలో అటు ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలామంది ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు తరలివెళ్లారు. అయితే థియేటర్కు వెళ్ళిన ప్రేక్షకులకు మాత్రం నిరాశే ఎదురైంది. ఎందుకంటే బాలయ్య రూలర్ సినిమా పూర్తిగా రొటీన్ గా అందరికీ బోర్ కొట్టించింది. నటన పరంగా ఎనర్జీ పరంగా రూలర్ సినిమా లో బాలయ్య ఇరగదీసినప్పటికీ.. కథ కథనం పరంగా మాత్రం రూలర్ సినిమా బాలకృష్ణ పాత సినిమాలను తలపిస్తోంది. గతంలో బాలకృష్ణ సినిమాలు ఎలా ఉన్నాయో రూలర్ సినిమా కూడా అలాగే ఉంటుంది. రూలర్ సినిమా చూసినంత సేపు గతంలో బాలకృష్ణ చేసిన సినిమాలు  గుర్తుకు వస్తూ ఉంటాయి. 

 

 

 

 దీంతో ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపు బోరింగ్ గా ఫీల్ అయ్యారు. అయితే బాలయ్య సినిమా కేవలం బి సి ప్రేక్షకులను  ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు దర్శకుడు. దీంతో బాలయ్య సినిమా చూడడానికి వెళ్లిన మాస్ ప్రేక్షకులు అందరూ పూనకంతో ఊగి పోతారు. అయితే దర్శకుడు కేస్ రవికుమార్ కథ కథాంశం విషయంలో మాత్రం కాస్త కొత్తగా ఆలోచించలేదు... బాలకృష్ణ రొటీన్ కథలు అన్నింటిని మిక్స్ చేసి పరమ రొటీన్ గా రూలర్ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కె.ఎస్.రవికుమార్. నాలుగు పంచు డైలాగులు నాలుగు పాటలు నాలుగు ఫైట్లు ఇలా బాలకృష్ణ పాత సినిమా లాగే ఈ సినిమా కూడా సాగిపోతూ ఉంటుంది. దీంతో బాలకృష్ణ కి మరో ఫ్లాప్ రావడం ఖాయం అన్నట్టుగా సినిమా చూసిన ప్రేక్షకులు నుండి టాక్ వినిపిస్తోంది. 

 

 

 

 దర్శకుడు కె.ఎస్ రవికుమార్ రూలర్ సినిమా విషయంలో కొంచమైనా కొత్తగా ఆలోచించలేదు. గతంలో బాలకృష్ణ నటించిన లయన్ సినిమా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ రూలర్ సినిమా కంటే లయాన్  సినిమానే బాగుంది అని ప్రేక్షకులు భావిస్తున్నారు. లయన్  సినిమాలో  కథాంశం పంచు డైలాగులు కొత్త గా ఉన్నాయని రూలర్ సినిమాలో  అది కూడా లేదని ప్రేక్షకుల నుంచి టాక్ వినిపిస్తోంది. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన పైసా వసూల్ లో కూడా బాలకృష్ణ ఎంతో కొత్తగా కనిపించాడు. ఇక పైసా వసూల్ సినిమా లో బాలకృష్ణ డైలాగ్ డెలివరీ కూడా బాగుంది కానీ.. ఈ సినిమాలో మాత్రం అలాంటివి ఏమీ లేవు అని ప్రేక్షకుడు భావిస్తున్నారు. కనీసం దర్శకుడు ఈ సినిమా విషయంలో కొంత అయినా వినూత్నంగా ఆలోచించి ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారు.  రూలర్  సినిమాకంటే బాలయ్య ఓల్డ్ సినిమాలే  లెటర్ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: