యువరత్న నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు కె.ఎస్ రవికుమార్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా సినిమా రూలర్ సినిమా నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి షో చూసిన ప్రేక్షకుల్లో చాలావరకూ సినిమా పై నెగిటివ్ స్పందన ని అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలోని కథ మరియు కథనాల్లో ఏమాత్రం కొత్తదనం లేదని, పైగా గతంలో రిలీజ్ అయిన పలు సినిమాల్లోని సీన్లను పోలిన సీన్లు ఈ సినిమాలో చాలా ఉన్నాయని, 

 

కథనం చాలా సాదా సీదాగా సాగుతుందని చెప్తున్నారు. కేవలం ఫ్యాన్స్ కోసమే బాలయ్యకు మాస్ ఫైట్స్, యాక్షన్ సీన్స్ ని దర్శకుడు అవి డిజైన్ చేశాడా అనేలా ఉన్నాయట. హీరోయిన్స్ గా నటించిన వేదిక మరియు సోనాల్ చౌహాన్ లకు సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేదని, అలానే సెకండాఫ్ చాలా వరకు బోరింగ్ గా సాగుతుందని కూడా అంటున్నారు. ఈ ఏడాది ప్రథమార్థంలో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల మాదిరిగానే ఈ రూలర్ సినిమా కూడా ఆయనకు మరొక ఫ్లాప్ ని అందించిందని, 

 

కావున ఆయన ఫ్యాన్స్, తదుపరి బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ నేడు దీనితో పాటు మరొక మూడు సినిమాలు రిలీజ్ అవుతుండడంతో, వాటి ధాటికి తట్టుకొని రూలర్ నిలబడడం కష్టమని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. కావున హీరో బాలకృష్ణ గారు కూడా మున్ముందు తన తదుపరి సినిమాల స్క్రిప్టుల విషయంలో తగిన జాగ్రత్త తీసుకోకపోతే మరిన్ని ఫ్లాప్స్ ఆయన చవిచూడవలసి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. అందరినీ చాలావరకు నిరాశపరిచిన  ఈ రూలర్ సినిమా ముందు ముందు ఏం జరగనుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే...!!!

మరింత సమాచారం తెలుసుకోండి: