‘రంగస్థలం’ మూవీతో రామ్ చరణ్ కు జాతీయ స్థాయిలో అవార్డ్ వస్తుందని చాలామంది భావించారు. అయితే ఆ అవార్డ్ కొన్ని కారణాల వల్ల కేవలం ఒక్క ఓటుతో మిస్ అయింది. ఈ మూవీ కోసం చరణ్ పడ్డ కష్టాన్ని మాత్రం ఫిలిం ఫేర్ అవార్డ్స్ కమిటి గుర్తించింది.
వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల కంటే మన సెలెబ్రెటీలు ఫిలిం ఫేర్ అవార్డులను చాల గౌరవంగా మరింత గుర్తింపుగా భావిస్తారు. చరణ్ కు గతంలో ‘చిరుత’ లో నటించినందుకు అదేవిధంగా ‘మగధీర’ మూవీలోని అతడి పాత్రకు ఇప్పటికే రెండు సార్లు ఫిలిం ఫేర్ అవార్డ్స్ వచ్చాయి.
చరణ్ కెరియర్ లో 120 కోట్ల కలక్షన్స్ ను రాబట్టిన ‘రంగస్థలం’ అతడి కెరియర్ ను మరొక స్థాయికి తీసుకు వెళ్ళింది. ఇదే ‘రంగస్థలం’ కు సంబంధించి చంద్రబోస్ కు పాటల రచయితగా రత్నవేలుకు బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా కూడ ఫిలిం ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. అయితే ‘రంగస్థలం’ లాంటి మంచి సినిమాకు దర్శకత్వం వహించిన సుకుమార్ కు దర్శకుడుగా ఫిలిం ఫేర్ నుండి గుర్తింపు రాకపోవడం ఆశ్చర్యకరం.
‘రంగస్థలం’ లోని రంగమ్మత్త పాత్రతో పాపులర్ అయిన అనసూయకు ‘బ్లాక్ లేడి’ అంటూ ఆమెకు సహాయ నటి విభాగంలో ఫిలిం ఫేర్ అవార్డ్ ప్రకటించారు. అయితే ఈ విషయం పై అనసూయ స్పందిస్తూ చేసిన ట్విట్ మాత్రం చాల సంచలనంగా మారి ఏకంగా అనసూయ ఫిలిం ఫేర్ అవార్డ్స్ కమిటీ పై సెటైర్లు వేసిందా అని అనిపించేడట్లుగా ఉంది. "Errrr.. did the meaning of 'Unsung' change???" అంటూ ఆమె చేసిన ట్విట్ వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ చాలామంది ఆ ట్విట్ కు అర్ధాలు వెతుకుతున్నారు. అనసూయను బ్లాక్ లేడీగా గుర్తించి ఫిలిం ఫేర్ పత్రిక ఇచ్చిన అవార్డ్ ఆమెకు నచ్చలేద అన్న సందేహాలు రావడం సహజం..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి