క్రియేటివ్ జీనియస్ వర్మ సినిమాల హిట్ రేషియో ఎలా ఉన్నా, వరుసెంట సినిమాలు తీయడం మాత్రం ఆగడు. సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా ఏమాత్రం తేడా లేకుండా సినిమాలు తీస్తాడు. ప్రస్తుతం వన్ మంత్ బ్యాక్ సత్యా2కి హడావిడి చేసిన వర్మ ఇప్పుడు సీక్రెట్ గా తను రెండు సినిమాల షూటింగ్ చేసుకుంటున్నాడు. దీని గురించి మీడియా కి ఎటువంటి ఇన్ ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక ఆ సినిమాల్లో ఒకటి మంచు విష్ణు హీరోగా చేస్తున్న సినిమా ఒకటైతే.. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకుని సినిమా హిట్ కోసం తహ తహ లాడుతున్న రాజశేఖర్ హీరోగా ఇంకో సినిమా.. ఏంటి వర్మ రాజశేఖర్ హీరోగా సినిమా తీస్తున్నాడా..? అని అందరూ ఆశ్చర్య పోవచ్చు నిజమేనని అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. అంతేకాదు ఈ రెండు సినిమాలను సింగిల్ సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ డిసైడ్ అయ్యాడట వర్మ. సంచలనాల వర్మ ఏం చేసిన అది ఒక సంచలనమే కదా.. అయితే తను రాజశేఖర్ తో తీసే సినిమా టైటిల్ ని ‘ మిట్ట మధ్యాహ్నం ’ అని డిసైడ్ చేశాడట. మరోసారి మాంచి హర్రర్ కథ తో మనముందుకు రాబోతున్నాడు వర్మ అనిపిస్తుంది. ఇంకా ఇదే కాక మంచు విష్ణు హీరోగా చేస్తున్న రాయలసీమ ఫ్యాక్షన్ సినిమా పేరు కూడా ‘ ఒట్టు ’ అని పెట్టనున్నారట. సో ఇవన్నీ నమ్మవచ్చా లేదా తెలియదు కానీ మొత్తానికి వర్మ సినిమా మరో కొద్ది రోజుల్లో రాబోతుందని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: