పూరీ జగన్నాథ్ తన కొడుకును హీరోగా నిలబెట్టాలని చాల గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ప్రస్తుతం ఆకాష్ హీరోగా నటిస్తున్న ‘రొమాంటిక్’ మూవీ కోసం భారీగా బడ్జెట్ పెంచుతూ ఈ సినిమాకు అన్నీ తానే కర్త కర్మ క్రియ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో విపరీతమైన గ్లామర్ ఎక్స్ పోజింగ్ సీన్స్ ఉంటాయి అన్న సంకేతాలు ఇప్పటికే వస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితులలో పూరీ కొడుకు ఆకాష్ ఒక పెను వివాదం నుండి త్రుటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేక్ ఎకౌంట్ల హంగామా పెరిగిపోవడంతో చాలామంది సెలెబ్రెటీల పేరుతో ఫేక్ అకౌంట్స్ ఓపెన్ అవుతూ అనేక వివాదాస్పద వ్యాఖ్యలు కొన్ని బూతు ఫోటోలు ఆ ఫేక్ ఎకౌంట్స్ లో కనిపిస్తున్నాయి. 

దీనితో చాలామంది సెలెబ్రెటీలు రంగంలోకి దిగి తమ అకౌంట్లను వెరిఫై చేయించుకుంటూ తమ అభిమానులకు కన్ఫ్యూజన్ లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆకాష్ మాత్రం ఈ విషయమై పెద్దగా శ్రద్ధ పెట్టక పోవడంతో ఆకాష్ పూరీ పేరుతో ఒక వ్యక్తి ఒక ఫేక్ అకౌంట్ ను ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. 

ఆ ఫేక్ అకౌంట్ నిజం అని భావించిన కొంతమంది అమ్మాయిలు ఆ ఫేక్ అకౌంట్ కు మెసేజ్ లు పెట్టడంతో దానిని ఆధారంగా తీసుకుని ఆ అజ్ఞాత వ్యక్తి కొంతమంది అమ్మాయిలను ట్రాప్ చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ట్రాప్ లో పడబోయి తెలివిగా తప్పించుకున్న ఒక అమ్మాయి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ అజ్ఞాత వ్యక్తి అడ్డంగా దొరకడంతో పాటు ఈ వ్యవహారం నడపడం కోసం అతడు వాడిన కంప్యూటర్ పెన్ డ్రైవ్ ను స్వాధీనం చేసుకుని అతడిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ లేడీ తెలివిగా వ్యవహరించడంతో ఆకాష్ పెను సమస్య నుండి బయటపడ్డాడు అనుకోవాలి. దీనితో ఇప్పుడు ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో హాట్ న్యూస్ అయింది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: