శ్రీహరి చనిపోయి చాల నెలలు గడిచిపోయినా శ్రీహరి లాంటి మంచినటుడు టాలీవుడ్ కు దూరం కావడం దురదృష్టం అని దర్శక, నిర్మాతలు అనుకుంటూ ఉంటారు. కానీ రియల్ స్టార్ శ్రీహరి భార్య శ్రీహరిని నటించడం రాదు అంటు ఏడిపిస్తూ, విమర్శించేదట. ‘సాంబయ్యా’ ‘అయోధ్యరాముడు’ సినిమాలు చూసిన తరువాత మాత్రమే తాను శ్రీహరిని నటుడిగా అంగీకరించాననీ డిస్కో శాంతి చెపుతోంది  రియల్ స్టార్ రియల్ లైఫ్ లోని అనేక విషయాల గురించి ఈరోజు ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీహరి గురించి చాలామందికి తెలియని చాల విషయాలు తెలియచేసింది డిస్కో శాంతి. శ్రీహరి బ్రతికి ఉన్నప్పుడు తనను ఇంటికి వచ్చి అక్కా, చెల్లి, అమ్మ, వదిన, అని పిలిచి ఎంతో ఆప్యాయత కనపరిచే చాలామంది శ్రీహరి చనిపోయిన తరువాత కనీసం తన ఇంటికి కూడా రాకపోవడం చూస్తూ ఉంటే మానవ సంబంధాలు ఇంత ఘోరంగా ఉన్నాయా అని చెప్పి బాధ పడుతోంది డిస్కో శాంతి  ప్రతి సంవత్సరం న్యూయిర్ వచ్చింది అంటే ఎంతో హడావిడిగా కనిపించే తన ఇల్లు ఈ సారి బోసిపోతుందని అంటు తనకు పిల్లలు లేకపోతే ఎనాడో శ్రీహరిని వెతుక్కుంటూ చనిపోఎదానినని వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చింది డిస్కో శాంతి. ఎదిఎమైనా ఒక వ్యక్తి మరణం ఆ కుటుంబలో ఎంతటి నిరాశను మిగులుస్తుంది అన్న దానికి ఈ జీవితమే ఉదాహరణ.

మరింత సమాచారం తెలుసుకోండి: