ప్రిన్స్ మహేష్ బాబు సినిమా అంచనాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని విడుదలైన మహేష్ బాబు తాజా సినిమా ‘1-నేనొక్కడినే' థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన 1 రోజులోనే 5 లక్షల హిట్స్ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఈ కౌంట్ 8 లక్షలు క్రాస్ అయింది అని అంటున్నారు. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ సినిమా అమ్ముడుపోని భారీ మొత్తాలకు ఈ సినిమా బిజినెస్ చేయడంతో ఈ సినిమా పై విపరీతమైన అంచనాలు పెరిగి పోతున్నాయి. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1200 ధియేటర్ల పైన సంఖ్యలో విడుదలచేసే ఉద్దేశ్యంలో ఈ ఫిలిం యూనిట్ ఉంది.
రొటీన్ సినిమాలకు భిన్నంగా హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో సినిమా తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది అని విశ్లేషకులు అంటున్నారు. జేమ్స్ బాండ్ సినిమాల మాదిరిగా ఈచిత్రంలో హై యాక్షన్, సస్పెన్స్‌తో కూడిన సన్నివేశాలలో మహేష్ కనిపించ బోతున్నాడని టాక్.
తన కెరియర్ లో ఇదొక ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని మహేష్ బాబు స్వయంగా వెల్లడించడంతో మహేష్ అభిమానులంతా జనవరి 10వ తారీఖు కోసం రోజులు లెక్క పెడుతున్నారు. సెంటిమెంట్ కలిసి వచ్చి ఈ సినిమా కూడా హిట్ అయితే ఇక నెంబర్ 'వన్' గా మహేష్ మారిపోతాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: