ఏపీఐఐసీ ఛైర్మన్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా తన సొంత నియోజకవర్గం నగరిలో సందడి చేస్తున్నారు. సంక్రాంతి పండుగ వేళలో సొంత నియోజకవర్గం నగరిలో రోజా సంక్రాంతి పండగ సంబరాలను మొదలుపెట్టారు. ఒకవైపు జబర్దస్త్ షోకు జడ్జీగా వ్యవహరిస్తూనే సంక్రాంతి టీవీ ప్రోగ్రామ్ లలో పాల్గొంటున్న రోజా సంక్రాంతి పండుగను నగరిలో తన కుటుంబ సభ్యులతో కలిపి జరుపుకుంటున్నారు. 
 
అటు సినీ రంగంలోను, ఇటు రాజకీయ రంగంలోను, జబర్దస్త్ షో జడ్జిగాను అభిమానులను గెలుచుకున్న రోజా ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానాలను ఇస్తూ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత వచ్చిన తొలి సంక్రాంతి కావడంతో నగరికి వెళ్లిపోయి రోజా తన కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. నగరిలో పిల్లలకు బోగి పళ్లు పోసి ముగ్గులు వేసిన రోజా స్వయంగా ఎద్దుల బండిని తోలారు. 
 
పండుగ ఫోటోలలో, వీడియోలలో రోజాతో పాటు రోజా కూతురు అన్షూ మాలిక హైలెట్ గా నిలిచారు. స్పెషల్ అట్రాక్షన్ గా రోజా కూతురు అన్షూ మాలిక ఈ ఫోటోలలో కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో రోజా ముగ్గులు వేసిన, బోగి పళ్లు పోసిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. రోజా అభిమానులు, వైసీపీ పార్టీ అభిమానులు ఫోటోలను, వీడియోలను ఫోటోలను షేర్ చేస్తున్నారు. 
 
ఇప్పటివరకూ బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని రోజా కూతురు అన్షూ మాలిక ఫోటోలలో, వీడియోలలో హైలెట్ అవ్వడంతో టాలీవుడ్ లో అన్షూ మాలిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మరి రోజా అన్షూ మాలికను హీరోయిన్ గా పరిచయం చేస్తుందో లేదో చూడాల్సి ఉంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వేల సంఖ్యలో షేర్ అవుతున్నాయి. మరి అన్షూ మాలిక నిజంగా హీరోయిన్ కాబోతుందా...? లేదా...? అనే విషయంపై స్పష్టత రావాలంటే మాత్రం కొన్నిరోజులు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: