ఒకప్పుడు వరుస విజయాలు అందుకున్న రవితేజ గత కొన్ని సంవత్సరాల నుండి సరైన హిట్లు లేక ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. జనవరి 24వ తేదీన రవితేజ నటించిన డిస్కో రాజా సినిమా విడుదల కానుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న రవితేజ తన గురించి ఎవరికీ తెలియని కొత్త విషయాలను ఈ ఇంటర్వ్యూలలో వెల్లడిస్తున్నాడు. 
 
రోజూ సాయంత్రం ఆరు తరువాత సినిమాల గురించి అస్సలు ఆలోచించనని వర్కవుట్ చేయటం, కుటుంబానికి, సమయం కేటాయించటం, ఎదుగుతున్న పిల్లలతో మరికాస్త సమయం గడపడం ఇదే తనకు తెలిసిన ప్రపంచం అని రవితేజ చెప్పారు. నేనెవరికీ సలహాలు ఇవ్వనని, సలహాలు తీసుకోనని ఆ క్షణంలో అలా చేయలేకపోయానే అని అస్సలు బాధ పడనని అన్నారు. సినిమా హిట్టైతే భుజాలు ఎగరేసుకోకూడని ఫ్లాప్ అయితే కుమిలిపోకూడదని అన్నారు. 
 
చిన్నప్పుడు మా నాన్న నన్ను చితక్కొట్టేశారని అన్నారు. నేను కూల్ గా హ్యాపీగా ఉండగలుగుతున్నానంటే కారణం తన కుటుంబమేనని అన్నారు. తన పిల్లలకు విలాసాలు అస్సలు అలవాటు చేయలేదని మోటార్ సైకిళ్లు, కార్లు కొనిపెట్టలేదని ఇప్పటికీ స్కూల్ బస్సులోనే ప్రయాణం చేస్తుంటారని చెప్పారు. తనకు దేవుడిపై నమ్మకం గుళ్లకు వెళ్లనని పూజలు చేయనని వాస్తుపట్టింపులు ఏ మాత్రం లేవని అన్నారు. 
 
మనస్సు, బుద్ధి సరిగ్గా ఉంటే అన్నీ బాగుంటాయని అన్నారు. హైదరాబాద్ లో 
షూటింగ్ అంటే భోజనం సమయానికి వెళ్లిపోవాల్సిందే అని చెబుతున్నారు. నాన్ వెజ్ దాదాపుగా మానేశానని అమ్మ ప్రేమగా వండి పెడితే మాత్రం అప్పుడప్పుడూ రుచి చూస్తుంటానని చెప్పారు. చిన్నప్పుడు నాన్న పాకెట్ మనీ ఇచ్చేవారని దాన్ని జాగ్రత్తగా చూసుకునేవాడినని అన్నారు. ఆ డబ్బులు అయిపోతే అమ్మ బ్యాగులోంచి చిల్లర కొట్టేసేవానినని అమ్మకు డబ్బు లెక్కలు తెలీవు కాబట్టి అది నాకు ప్లస్ అయ్యేదని రవితేజ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: