ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి తన అందం అభినయంతో మేటితారగా ఎదిగి అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టి.. పెళ్లి తర్వాత హీరోయిన్ గా కూడా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తున సమంత అక్కినేని ప్రస్తుతం సినిమాల సెలక్షన్స్ విషయంలో ఆచితూచి అడుగులేస్తుంది. ఓ పక్క కమర్షియల్ ఎంటర్టైనింగ్ సినిమాలు చేస్తూనే మరోపక్క హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లాస్ట్ ఇయర్ మజిలీ, ఓ బేబీ సినిమాలు సూపర్ హిట్ అందుకోగా ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ మూవీ 96 రీమేక్ జాను సినిమాలో నటిస్తుంది సమంత.

 

మాత్రుకలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించగా తమిళ ప్రేక్షకులను ఆ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఆ సినిమా తెలుగు రీమేక్ ను కూడా తమిళ దర్శకుడు ప్రేం కుమార్ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తుండగా సమంత హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్.. రీసెంట్ గా రిలీజైన సినిమాలోని ఫస్ట్ సానంగ్ అన్ని సూపర్ అనిపించాయి. 96 తెలుగు రీమేక్ అనగానే అక్కడ మ్యాజిక్ ఇక్కడ రిపీట్ అవుద్దా అని చాలామంది డౌట్ పడ్డారు.

 

అయితే ఇక్కడ ఉన్నది ఎవరు సమంత కదా కచ్చితంగా మ్యాజిక్ రిపీట్ అయ్యి తీరుతుందని అంటున్నారు. పోస్టర్స్ తోనే సినిమాపై ఓ పాజిటివ్ ఫీల్ రాగా రీసెంట్ గా వచ్చిన సాంగ్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది. 96 మూవీతో కోలీవుడ్ లో త్రిష మళ్లీ ఫాం లోకి వచ్చింది. ఆమెకు ఆ సినిమా ద్వారా 11 అవార్డులు వచ్చాయి. ఇక ఆల్రెడీ ఫాం లో ఉన్న సమంత తెలుగు జాను ద్వారా ఎలాంటి సత్తా చాటుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: