తెలుగు చిత్ర పరిశ్రమలో తన లక్కును  పరీక్షించుకుని ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి వరుస అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్ తాప్సీ. గ్లామర్ ఓరియంటల్ సినిమాలను మాత్రమే కాకుండా ఓ విభిన్నమైన కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాల్లో  నటిస్తూ అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది తాప్సీ. తక్కువ కాలంలోనే బాలీవుడ్లో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది . వరుసగా మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాల్లో  అవకాశాలు వస్తుండడంతో తాప్సి క్రేజ్ క్రమక్రమంగా పెరిగిపోతుంది. ఇప్పటికే ఎన్నో వైవిధ్యాత్మిక సినిమాల్లో నటించి తన నటనతో అద్భుతంగా ఆకట్టుకుంది ఈ అమ్మడు . ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ థప్పడ్  అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. 

 


 ఫిబ్రవరి 28న విడుదల కాబోతున్న ఈ సినిమా తాప్సి  అన్ని సినిమాల్లో లాగానే కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉండబోతుంది అని ట్రైలర్ చూస్తుంటే ఈజీగా అర్థమవుతుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ లో సినిమా కథకు సంబంధించి ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ ట్రైలర్ ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. భార్యను భర్త నలుగురిలో చెంపదెబ్బ కొడితే ఆమె అహం దెబ్బతిని అతడితో విడాకులు తీసుకోవాలని అనుకుంటున్న సమయంలో ఆమె ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ ఎలా  ఉంటుందని ట్రైలర్ లో క్లారిటీ వచ్చింది.కాగా ఈ  ట్రైలర్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 


 ఈ ట్రైలర్  చూసిన కొంతమంది మగవారు చిన్న చెంపదెబ్బ కు విడాకులు తీసుకోవాలంటూ  సినిమాలో చూపిస్తే మా భార్యలను  ఎప్పుడైనా పొరపాటున చెంపదెబ్బ కొడితే... విడాకుల వరకు వెళ్లాలని చూపిస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు .. ఇదిలా ఉంటే మరోవైపు తాప్సీ అభిమానులు ఈ చిత్రం ద్వారా నటిగా తాప్సీ మరో మెట్టు  ఎక్కడం ఖాయమని చెబుతున్నారు. సినీ విశ్లేషకులు కూడా ఈ సినిమా తాప్సి  సినీ కెరియర్ లోనే ప్రత్యేకంగా మారుతుంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తూన్నారు . ఇప్పటివరకు విభిన్నమైన పాత్రల్లో నటించిన తాప్సి పొన్ను .. ఈ సినిమాలో మాత్రం గృహిణిగా కనిపించబోతుంది. కాగా  తాప్సి సినిమాలో  గృహిణిగా కనిపించేందుకు ఒప్పుకోవడంతో తాప్సీపై  అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: