టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. మెగా హీరో రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా భారీ హిస్టారికల్ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయింది. రాబోయే జులై లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్ సహా పలు ఇతర భాషల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే తనకు ఎంతో ఆప్తుడైన రాజమౌళిని టాలీవుడ్ కి తన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో పరిచయం చేసిన ఎన్టీఆర్ కు ఆయనంటే అమితమైన ప్రేమ. అందుకే ఆయనను ముద్దుగా జక్కన్న అని పిలుచుకునే ఎన్టీఆర్ కు రాజమౌళి ఏమి చెప్పినా కాదనలేనని, ఎన్టీఆర్ పలు మార్లు ఇంటర్వ్యూ ల్లో చెప్పడం జరిగింది. ఇకపోతే ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ హిట్ అనంతరం సింహాద్రి సినిమా తీసి మరొక సూపర్ హిట్ కొట్టిన రాజమౌళి

 

ముచ్చటగా మూడవసారి ఆయనతో కలిసి తీసిన యమదొంగ విషయమై మాత్రం ఎన్టీఆర్ ని ఆల్మోస్ట్ నరకయాతన పెట్టినట్లు స్వయంగా పలు మార్లు ఎన్టీఆర్, రాజమౌళి ఇద్దరూ కూడా చెప్పడం జరిగింది. అంతకముందు ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమా రిలీజ్ తరువాత, రాజమౌళి ఎన్టీఆర్ తో మాట్లాడుతూ, తారక్ నీ సినిమాల సెలక్షన్ ఎంతో బాగుంటుంది, కానీ మీ భారీ ఖాయం చూసి కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ మాత్రం మీ సినిమాలు చూడడం మానేశారు, ఆ విషయం మీకు తెలుసా అని అడిగారట. అయితే మొదటి నుండి మంచి భోజన ప్రియుడైన ఎన్టీఆర్, తన తల్లి ప్రేమను కాదనలేక ఎక్కువగా మంచి ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ తినేవారట. అయితే నీతో తదుపరి నేను తీయబోయే యమదొంగ సినిమా కోసం నువ్వు పూర్తిగా బరువు తగ్గాల్సిందే అంటూ నియమం పెట్టారట. దానితో కొంత ఆలోచనలో పడ్డ ఎన్టీఆర్

 

తప్పుకుండా సినిమా కోసం, అలానే ఫ్యాన్స్ కోసం ఎంత కష్టం అయినా భరించడానికి సిద్ధం అయ్యారట. అయితే బరువు తగ్గే సమయంలో ఆకలి విపరీతంగా వేసిన సందర్భాల్లో ఎన్నో సార్లు కడుపు మాడ్చుకుని మంచినీళ్లే తాగి గడిపారట. అలానే ఎంతో కఠినమైన వ్యాయామాలు చేయడం, ఫ్యాట్ ఉన్న నెయ్యి, వెన్న, పాలు, నాన్ వెజ్ వంటివి తినక పోవడంతో ఆయన అవస్థ చూసి తల్లి షాలిని కూడా పలుమార్లు కన్నీరుపెట్టుకున్నారట. అయితే ఆ సమయంలో అంత కఠినంగా నియమాలు పాటించడం వల్లనే యమదొంగలోని చాలా సీన్స్ లో ఎన్టీఆర్ ఎంతో నాజూగ్గా అందంగా కనపడడం జరిగింది. అయితే కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనను తాను ఎప్పటికీ మరిచిపోలేనని అప్పుడప్పుడు ఎన్టీఆర్ దీనిని గుర్తు చేసుకుంటూ ఉంటారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: