మెగాస్టార్ చిరంజీవి తర్వాత మెగా ఫ్యాన్స్ ను అలరించి పవర్ స్టార్ గా ఎదిగి తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న హీరో పవన్ కళ్యాణ్. ఆయన సినిమా చేస్తే ఆ హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో తెరంగేట్రం చేసిన కళ్యాణ్ ఆ సినిమాతో నిరాశపరచినా గోకులంలో సీత, సుస్వాగతం సినిమాతో సత్తా చాటాడు. ఇక యువతను మెప్పించే ప్రేమకథలతో తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న పవర్ స్టార్ అంటే అభిమానులకు విపరీతమైన ప్రేమ.

 

అభిమానం పీక్స్ లో ఉంటే ఎలా ఉంటుందో అంటే కొందరు చెప్పే ఉదహరణ పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఉండే పిచ్చని అంటారు. కొందరు పిచ్చి అన్నా.. కొందరు అభిమానం అన్నా సరే పవన్ ఫాలోయింగ్ తో పోల్చుకుంటే మిగతా టాలీవుడ్ ఏ హీరోకు లేని హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ ఉందని చెప్పొచ్చు. అందుకే పవన్ ఏదైనా ఈవెంట్ కు వస్తున్నాడు అంటే ఆ ఆడిటోరియం పవర్ స్టార్ పవర్ స్టార్ అన్న కేకలతో దద్దరిల్లిపోద్ది. అయితే ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే అతన్ని గౌరవాన్ని కాపాడతారు కాని కొందరు పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ మీద ఎవరైనా నెగటివ్ కామెంట్ చేస్తే వారిని ఎటాక్ చేస్తారు.

 

ముఖ్యంగా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన పవన్ గురించి నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుతారు. అదో పొలిటికల్ గేం అయితే పవన్ ను టార్గెట్ చేసిన వారందరిని పవర్ స్టార్ ఫ్యాన్స్ టార్గెట్ చేయడం అది పవన్ కు కొత్త తలనొప్పి తీసుకురావడం మనం చూస్తూనే ఉంటాం. ఫైనల్ గా పవన్ ను అభిమానించే అభిమానులు ఆయన్ను ఆరాధిస్తుంటారు. పవన్ సినిమాలు ఆపేస్తున్నాడని తెలిసి ఢీలా పడ్డ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన మళ్లీ సినిమాలు మొదలు పెట్టాడని తెలిసి సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ కు తోడుగా ఫ్యాన్స్ ఎప్పుడూ ఇలానే ఉంటారని ఉండాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: