ప‌వ‌న్ కళ్యాణ్ తిరిగి సినిమాల నటించడం పై భిన్నాభిప్రయాలు వ్యక్తం అవుతున్న పరిస్థితులలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ పవన్ రీ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ప‌రుచూరి గోపాల‌కృష్ణ నిర్వహిస్తున్న వెబ్ ఛానల్ లో ‘ప‌రుచూరి ప‌లుకులు’ పేరుతో ఓ వీడియోను షేర్ చేసాడు. 

ఇప్పుడు ఆ వీడియో మీడియాలో మాత్రమే కాకుండా పవన్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ నాయకుడుగా వీధివీధి తిరిగి జనం కు విషయాలు చెప్పడం అంటే ఒక అద్భుతమైన పాత్ర పోషించి జనం కు మెసేజ్ లు ఇస్తే అది జనంలోకి వెంటనే వెళ్ళి పోతుందని అటువంటి అద్భుతమైన అవకాశం పవన్ కు దేవుడు ఇచ్చాడు అంటూ కామెంట్ చేసాడు. ‘కర్తవ్యం’ సినిమాను చూసి అనేకమంది మహిళలు పోలీసు ఆఫీసర్లు అయిన విషయం తనకు తెలుసు అంటూ ఒక సినిమా పాత్ర ప్రజలను ఏవిధంగా ప్రభావితం చేస్తుందో వివరించాడు. 

నట‌న‌ ర‌చ‌న సంగీతం భ‌గ‌వంతుడు ఇచ్చిన వరం అంటూ సృష్టికి ప్ర‌తిసృష్టి చేయగల శక్తి కళాకారులకు మాత్రమే ఉంది అంటూ అటువంటి అద్భుతమైన వరం విలువ గురించి ఇప్పటికైనా పవన్ తెలుసుకున్నందుకు ఆనందంగా ఉంది అంటూ కామెంట్ చేసాడు. ఎన్టీఅర్ ముఖ్యమంత్రి అయిన  తరువాత కూడ సినిమాలు చేసిన విషయాన్ని వివరిస్తూ ఎన్నికలలో ఓడిపోయిన తరువాత తిరిగి ముఖ్యమంత్రి కావడానికి అప్పట్లో ఆయన నటించిన ‘మేజర్ చంద్రకాంత్’ ఏవిధంగా కలిసి వచ్చిందో అన్న విషయాన్ని వివరించాడు.

అంతేకాదు పవన్ ఎమ్మెల్యే అయినా న‌టిస్తూనే ఉండాలి అని అంటూ రాజ‌కీయాల్లోకి వెళ్తే మేక‌ప్ వేసుకోవ‌డం త‌ప్పేమి కాదు అంటూ కామెంట్ చేసాడు. ప‌వ‌న్ రెండు పడవల నిర్ణ‌యాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్న పరిస్థితులలో పరుచూరి రంగంలోకి దిగి అభినందిస్తూ విడుదలచేసిన ఈ వీడియో పవన్ పై వచ్చిన విమర్శలకు ఎలాంటి సమాధానం ఇవ్వగలుగుతుందో చూడాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: