సినిమా పరిశ్రమలో రీమేక్ లు అనేవి ఒక్కో సందర్భంలో మంచి హిట్ సాధిస్తే మరొక సందర్భంలో ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అయితే అది ఆ సినిమా యొక్క కథలు, అందులోని పాత్రలను బట్టి కూడా ఉంటుదనేది తెల్సిందే. అయితే చాలావరకు మాత్రం నటులు తెలిసి తెలిసి రీమేక్స్ చేయటానికి కొంత ఆలోచిస్తూ ఉంటారు. అందులోను మన టాలీవుడ్ లో కొన్ని రీమేక్స్ మంచి విజయాలు అందుకుంటే మరికొన్ని అపజయం పాలైనవి కూడా ఉన్నాయి. ఇక ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే, ప్రస్తుతం సమంత, శర్వానంద్ కలిసి నటించిన జాను సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇటీవల తమిళ్ లో విజయ్ సేతుపతి, త్రిష కలిసి నటించిన 96 అనే ప్రేమకథా సినిమాలో ఎమోషన్స్, హీరో హీరోయిన్ల సహజ నటన, 

 

కథనం వంటివి సినిమా సూపర్ హిట్ కొట్టడానికి కారణం అయ్యాయి. అయితే ఈ సినిమాని చూసిన టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు, దీనిని ఎలాగైనా తెలుగులో రీమేక్ చేయాలని భావించారు. హీరోయిన్ గా సమంత అయితే సరిపోతుందని భావించిన రాజు, ఒకరోజు ఆమెకు ఫోన్ చేసి  96 చూసారా, నేను ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నానను, మీరు హీరోయిన్ గా చేస్తే బాగుంటుంది అని అడిగారట. అయితే ఆ సినిమా చూసిన సమంత, అందులో హీరో హీరోయిన్లిద్దరి నటనకు ఎంతో ఫిదా అయిపోయిందట. ముఖ్యంగా త్రిష పాత్రలో తాను నటించడం కష్టం అని భావించి, ఇకపై దిల్ రాజు గారు కనుక ఫోన్ చేస్తే నేను లేను అని చెప్పమని తన మేనేజర్ కు చెప్పిందట. ఆ విధంగా ఆయన మధ్యలో ఫోన్ చేస్తూ ఉండడంతో, 

 

మేనేజరేమో సమంత గారు లేరని చెప్పడం జరుగుతూ వస్తుండగా, ఒకరోజు ఇంటికి వచ్చిన రాజు గారు, ఆ సినిమా గురించి మరొక్కసారి చెప్పి, మీరు ఫైనల్ గా ఒప్పుకొండి చాలు, రేపు షూటింగ్ ప్రారంభం అయి, చివరికి పూర్తి అయినా తరువాత తప్పకుండా మీరే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు అని చెప్పి ఆమెను హీరోయిన్ గా ఒప్పించారట. నిజానికి మొదటి రోజు కొంత మ్యాజికల్ గా ఆరంభం అయిన ఈ సినిమా షూటింగ్ మొత్తం ఎంతో ఆహ్లాదంగా సాగిందని, కొన్ని సీన్స్ లో తనకు నిజంగా ఏడుపు వచ్చిందని చెప్పిన సమంత, తప్పకుండా ఆడియన్స్ థియేటర్స్ లో సినిమాని ఎంతో హృద్యంగా ఫీల్ అవుతూ కన్నీరు కరుస్తారని అంటోంది. ఇక దిల్ రాజు విషయమై జరిగిన ఈ విషయాన్ని, ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా సమంత చెప్పడం జరిగింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: